తెలంగాణ

ఇక కేసీఆర్‌కు నిద్రలేని రాత్రులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: రాష్ట్రంలో బీజేపీ విస్తరణ చూసి కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఇక నిద్రలేని రాత్రులు గడుపుతారని, నిద్ర కూడా రాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు.
ఆదివారం ఇక్కడ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, అమిత్‌షా తెలంగాణలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తే, టీఆర్‌ఎస్ గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయన్నారు. మిషన్ భగీరథను చూసి కేంద్రప్రభుత్వాన్ని జలపథకాన్ని ప్రవేశపెట్టందని ట్విటర్‌లో కేటీఆర్ ట్వీట్ చేస్తున్నారన్నారు. గుజరాత్ మిషన్ భగీరథ ప్రాజెక్టును కేసీఆర్ కాపీ కొట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఇచ్చింది కేంద్రప్రభుత్వమన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కావాలని టీఆర్‌ఎస్ ఏ రోజు కూడా కేంద్రప్రభుత్వాన్ని అడగలేదన్నారు. స్వయంగా కేంద్రజలవనరుల శాఖ సహా మంత్రి పార్లమెంటులో సమాధానం చెప్పారన్నారు. కేంద్రప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు తగవన్నారు. కేంద్రపథకాలతో కలుపుకుని కేంద్రప్రపభుత్వ నిధులు రాష్ట్రానికి 68 శాతం వచ్చాయన్నారు. కేంద్రప్రభుత్వ పథకాలను ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. అమిత్ షా తెలంగాణపై దృష్టిని పెట్టారన్నారు. బీజేపీ ఐదు బృందాలు రాష్ట్రంలో పర్యటించి పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకుంటామన్నారు. అవినీతిపైన రాజకీయపోరాటంతో పాటు న్యాయ పోరాటం చేస్తామన్నారు. సెక్షన్ 8 ద్వారా సచివాలయాన్ని కూల్చడాన్ని అడ్డుకోవాలని, అసెంబ్లీ తరలింపును అడ్డుకోవాలని ఆయన కోరారు.
చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్