తెలంగాణ

పందిని పోలిన పశు కూన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, జూలై 9: సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండలం చిన్నబోనాల మున్సిపల్ విలీన గ్రామంలో బర్రె కడుపులో పంది జన్మించింది. ఈ వింతపై గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. గ్రామానికి చెందిన గోసుకుల మల్లయ్య అనే రైతు పశువుల అంగడిలో తంగళ్ళపల్లి మండలం కస్బెకట్కూర్ గ్రామానికి చెందిన బిజిగ బాలమల్లు వద్ద నుంచి రూ.33 వేలకు ఈ బర్రెను కొనుగోలు చేశాడు. ఇంటికి తీసుకురాగా, అనంతరం బర్రె గర్భం దాల్చి, నెలలు నిండక ముందే ప్రసవించింది. జన్యుపరమైన లోపాలతో పంది ఆకారంలో ఉన్న పశువు జన్మించింది. ఈ విషయం కాస్తా ఆ నోటా ఈ నోటా చుట్టుపక్కల ప్రజలకు తెలియడంతో పంది ఆకారంలో ఉన్న బర్రెను చూసేందుకు గ్రామస్తులు తరలివచ్చారు. జన్యుపరమైన లోపం వల్ల, నెలలు నిండక పోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతాయని పశు వైద్యాధికారులు తెలిపారు.
చిత్రం... .పంది ఆకారంలో జన్మించిన పశువు