తెలంగాణ

మంథని గౌతమేశ్వరకి ‘కాళేశ్వరం’ జలధార

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, జులై 11: తెలంగాణ రాష్ట్రంలోని బీడు భూములన్నింటిని సాగులోకి తీసుకువచ్చేందుకు... లక్షలాది ఎకరాల భూములను సస్యశ్యామలం చేసేందుకు నిర్మాణం చేసిన ‘కాళేశ్వరం’ ప్రాజెక్ట్ నీరు మంథని గౌతమేశ్వరికి గురువారం చేరుకుంది.
మంథని గోదావరి తీరం వద్ద రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి జిల్లా జడ్పి చైర్మన్ పుట్ట మధు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ మంథని గోదావరిలోకి కాళేశ్వరం నీరు చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని అట్టహాసంగా పూజలు చేపట్టారు. నదిలో పెద్ద ఎత్తున పుష్పాలు వదిలారు. అనంతరం మంథని నియోజక వర్గ కేంద్రంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటాలకు పెద్ద ఎత్తున పాలాభిషేకాలు చేశారు. తెలంగాణను సస్యశ్యామలంగా చేసేందుకు నిర్మాణం చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి జలధార గోదావరిలోకి పొంగిపొర్లడంతో ఈ ప్రాంత ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ జలధారతో ఈ ప్రాంత రైతుల కళ్లల్లో ఆనందం కనబడుతుందని, ఎప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటామని చెప్పారు. అనంతరం మంథని వాసి, కాళేశ్వరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లును ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, సీపీ వి.సత్యనారాయణ, మంథని జడ్పీటీసీ తగరం సుమలత, ఎంపీపీ కొండ శంకర్‌తోపాటు తెరాస శ్రేణులు పాల్గొన్నారు.