తెలంగాణ

చేయాల్సింది మీరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న హైదరాబాద్ కామన్ హైకోర్టును విభజించి రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఏర్పాటు చేసే ప్రక్రియను సత్వరమే చేపట్టాలని సిఎం కె చంద్రశేఖర్ రావు కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఆంధ్ర, తెలంగాణకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేసి పని చేయడం ప్రారంభించిన తర్వాత మాత్రమే న్యాయాధికారులు, న్యాయస్థానాల సిబ్బంది పంపకాల ప్రక్రియ చేపట్టాలని కోరారు. ఏపీ పునర్వ్యవస్ధీకరణ చట్టంలో 31 సెక్షన్ ప్రకారం ప్రస్తుత హైకోర్టును విభజించి ఆంధ్రకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఈ ప్రతిపాదన పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. ప్రస్తుత హైకోర్టు న్యాయాధికారుల కేటాయింపు తీరుపట్ల తెలంగాణ న్యాయవాదులు, ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. హైకోర్టు న్యాయాధికారుల కేటాయింపు ప్రక్రియను ఈ ఏడాది మే 3న ప్రారంభించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 205మంది జిల్లా జడ్జిల క్యాడర్‌లో పని చేసేవారన్నారు. తెలంగాణకు 95మందిని, ఆంధ్రకు 110మంది ఈ కేడర్ న్యాయాధికారులను కేటాయించారు. తెలంగాణకు కేటాయించిన 95మందిలో 58మంది ఆంధ్ర స్ధానికత కలిగిన వారున్నారని అన్నారు. కాగా ఆంధ్రలో ఇదే క్యాడర్‌లో 29 ఖాళీలు ఉన్నాయి. వీటి భర్తీకి ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. మొత్తం సీనియర్, జూనియర్ సివిల్ జడ్జిలకు సంబంధించి ఆంధ్రకు చెందిన 143మందిని తెలంగాణకు కేటాయించారన్నారు. సబార్డినేట్ జ్యుడీషియల్ ఆఫీసర్ల కేటాయింపు తీరుపై న్యాయవాద సమాజం తీవ్ర ఆవేదనతో ఉందన్నారు. ఈ కేటాయింపులు తుది ఖరారుగా భావిస్తే తెలంగాణకు చెందిన న్యాయాధికారుల పదోన్నతులకు సంబంధించి ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. హైకోర్టు న్యాయమూర్తి స్థానానికి పదోన్నతి లభించడంలో ఆటంకాలు కలుగుతాయని, దీనికి అంతటికీ ఆంధ్ర న్యాయాధికారులను తెలంగాణకు కేటాయించడమే కారణమని కెసిఆర్ లేఖలో పేర్కొన్నారు. కేంద్రం న్యాయాధికారుల కేటాయింపులతో తుది నిర్ణయం తీసుకునే వరకూ రెండు రాష్ట్రాల్లో జిల్లా, సబార్డినేట్ కోర్టులో న్యాయాధికారులు యథాతథంగా పనిచేస్తారని విభజన చట్టంలో కేంద్రంలో పేర్కొన్నదన్నారు. ఈమేరకు 2014 మే 31న కేంద్రం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రస్తుత కేటాయింపుల్లో కేంద్రం ప్రమేయం లేదని విధితమవుతోందన్నారు. హైకోర్టు ఆధీనంలో న్యాయాధికారులు ఉన్నప్పటికీ, సెక్షన్ 77, సెక్షన్ 80 ప్రకారం కేంద్రమే న్యాయాధికారుల కేటాయింపు ప్రక్రియ చేపట్టాల్సి ఉందన్నారు. గతంలో చత్తీస్‌గఢ్, జార్కాండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు ఆయా రాష్ట్రాల హైకోర్టులు, కేంద్రానికి న్యాయాధికారుల కేటాయింపులపై ప్రతిపాదనలను పంపాయన్నారు. ఈ కేటాయింపులను ఖరారు చేసేముందు న్యాయాధికారుల స్థానికతను కేంద్రం పరిగణనలోకి తీసుకుందన్నారు. పైగా పునర్విభజన చట్టం ప్రకారం ఒక కమిటీని 30 రోజుల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ తరహా కమిటీని ఇక్కడ ఏర్పాటు చేయలేదన్నారు. రాజ్యాంగంలోని 3, 4 అధికరణల కింద కొత్త రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియకు ఉండే అధికారాలు విశేషమైనవని కేంద్రానికి రాసిన లేఖలో కెసిఆర్ పేర్కొన్నారు.

చిత్రం... హైకోర్టు గేటును పోలీసులు మూసివేసి పికెట్ ఏర్పాటు చేయడంతో,
పికెట్‌ను దాటుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న న్యాయవాదులు