తెలంగాణ

కోర్టు ఎదుట బాణసంచా పేల్చారని జడ్జి ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, జూలై 12: కోర్టు ఎదుట బాణసంచా కాల్చిన వారిపై కేసు నమోదు చేయాలని జడ్జి జారీ చేసిన ఆదేశాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయ. ఆయన ఆదేశాలకు నిరసనగా నాలుగు గంటల పాటు రాస్తారోకో నిర్వహించడంతో ఐదు కిలోమీటర్ల మేరకు పెద్దయెత్తున వాహనాలు నిలిచిపోయాయ. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయ. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని కమలానెహ్రూ కాలనీలో ప్యాట్ల లక్ష్మణ్ (45) అనే వ్యక్తి గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా శుక్రవారం కుటుంబ సభ్యులు మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి కాలనీ నుంచి కోర్టు మీదుగా శవయాత్రతో బయలుదేరారు. ఈ క్రమంలో కోర్టు ఎదుట గల అంబేద్కర్ చౌరస్తా వద్ద బాణసంచా పేల్చారు. దీంతో కోర్టు ఎదుట నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యం సృష్టించిన వారిని తనముందు హాజరుపర్చాలని జడ్జి అక్కడే ఉన్న పోలీసులను ఆదేశించారు. అనంతరం బాధ్యులైన ఐదుగురిపై న్యాయమూర్తి కేసులు నమోదు చేయంచారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు అంత్యక్రియలకు హాజరైన బంధువులు జడ్జి తీరును నిరసిస్తూ పట్టణంలోని ఎల్‌ఐసీ కార్యాలయం ఎదుట గల 63వ నంబర్ జాతీయ రహదారిపై మృతదేహంతో సుమారు నాలుగు గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. దీంతో రహదారికి ఇరువైపులా ఐదు కిలో మీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. గమ్యస్థానాలకు చేరుకునే ప్రయాణికులు వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చివరకు ఏసీపీ అందె రాములు, ఎస్‌హెచ్‌ఓ రాఘవేందర్, న్యాయవాదులు భూపతిరెడ్డి, గంట సదానందం తదితరులు జోక్యం చేసుకొని బాధితులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.
చిత్రం...మృత దేహంతో జాతీయ రహదారిపై నిరసన తెలుపుతున్న గ్రామస్థులు