తెలంగాణ

ట్యాంకర్ మాఫియా ఆదాయం నెలకు రూ.100కోట్లు: బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: హైదరాబాద్ మహానగరానికి పట్టిపీడిస్తున్న మంచినీటి సమస్యను పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ కార్యదర్శి శ్రీమతి కరుణా గోపాల్ ధ్వజమెత్తారు. భారత ప్రభుత్వం ప్రమాణాల ప్రకారం నగరాల్లో నీటి సరఫరాకు రోజుకు 135 ఎల్‌పీసీడీ అవసరమన్నారు. అయితే హైదరాబాద్ నగరంలో 162 ఎల్‌పీసీడీల వరకు నీటిని సరఫరా చేస్తున్నారన్నారు. ఈ నీటి ద్వారా 24 గంటలు అందరికీ నిరంతరాయంగా నీటిని సరఫరా చేయవచ్చన్నారు. కాని వాస్తవానికి వచ్చే సరికి నగరంలో రోజు విడిచి రోజు 2 లేదా 3 గంటల పాటు మాత్రమే నీటి సరఫరా జరుగుతోంనదన్నారు. హైదరాబాద్‌లో వాటర్‌మీటరింగ్ వంద శాతం ఉండాలని, హైదరాబాద్‌లో మీటరింగ్ 70 శాతం మాత్రమేనన్నారు. సరఫరా, పంపిణీ నష్టాలు 20 శాతం ఉండాలని, హైదరాబాద్‌లో 40 శాతం ఉందన్నారు. మెట్రోపాలిటన్ ప్రాంతంలో మున్సిపాలిటీల్లో 60 శాతం ఉందన్నారు. తగినంత మిగులు జలం ఉన్నా, హైదరాబాద్‌లో గొంతు ఎండుతుందో అర్థం కావడం లేదన్నారు. అంతర్గత అసమర్థత లేదా పరిపాలన నిర్వహణలోపమే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. నెలకు వంద కోట్ల రూపాయల వరకు ట్యాంకర్ మాఫియా దోచుకుంటోందన్నారు.