తెలంగాణ

ప్రజాసమస్యలపై 22న సీపీఐ కలెక్టరేట్ల ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: తెలంగాణలో సీపీఐని పటిష్టపరిచేందుకు కార్యాచరణ రూపొందించామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. ఒక పక్క ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తూనే మరో పక్క పార్టీ నిర్మాణానికి పెద్ద ఎత్తున కృషి చేస్తామని తెలిపారు. శనివారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ నవంబర్ 24 నుండి 26 వరకూ సీపీఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలను మంచిర్యాలలో నిర్వహించనున్నామని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు, తాగునీటి సమస్య, భూసమస్య, రైతు సమస్యలకు నిరసనగా జూలై 22న రాష్టవ్య్రాప్తంగా సీపీఐ కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం చేపట్టనుందని అన్నారు. బీజేపీని అడ్డుకట్టవేయడానికి లౌకిక, ప్రజాతంత్ర వామపక్ష శక్తులతో ప్రత్యామ్నాయ రాజకీయాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆగస్టులో గ్రామ బస్తీ సమావేశాలు, ఆగస్టులో మండల సమావేశాలు, సెప్టెంబర్‌లో జిల్లా సభలు, నవంబర్ 24 నుండి 26 వరకూ రాష్ట్ర నిర్మాణ మహాసభ నిర్వహిస్తామని అన్నారు. కేసీఆర్ రెండోమారు అధికారం చేపట్టిన తర్వాత రైతులపై అణచివేత, దాడులు పెరిగిపోయాయని చాడ వెంకటరెడ్డి అన్నారు. పోడు సాగు రైతులపై దాడులు జరుగుతున్నాయని, రైతులపై ఆకృత్యాలు, దుర్మార్గాలను ప్రభుత్వం మానుకోవాలని అన్నారు. పార్టీ కరీంనగర్ జిల్లా సీపీఐ కార్యదర్శి కే రాంగోపాల్ రెడ్డిని ప్రాధమిక సభ్యత్వం నుండి తొలగించామని పేర్కొన్నారు.