తెలంగాణ

తెలంగాణ రచయితల వేదిక కొనసాగుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: తెలంగాణ రచయితల వేదిక కొనసాగి తీరుతుందని, ఆ వేదిక గొంతుకోయాలని ప్రభుత్వం చూస్తే అది ఎంత మాత్రం సాగదని భావ ప్రకటన కోరుకుంటున్న 30 సామాజిక సంఘాలు శనివారం నాడు ప్రకటించాయి. సంఘాల ప్రతినిధులు అంతా ఆదివారం నాడు పెద్ద సమావేశాన్ని నిర్వహించి తమ గొంతు వినిపించాలని నిర్ణయించాయి. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, తెలంగాణ సాహితీ, అభ్యుదయ రచయితల సంఘం, ప్రజాసాహితీ, విరసం, ఛాయ, ఎరుక, విద్యావంతుల వేదిక, సంఘటిత, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కళామండలి, బహుజన రచయితల సంఘం, చాటింపు, బహుజన రచయితల వేదిక, టీపీఎస్‌కే, తెలంగాణ ప్రజా ఫ్రంట్, సీఎల్‌సీ, మానవ హక్కుల వేదిక, ఓపీడీఆర్, పీయూసీఎల్, తెలంగాణ ప్రజానాట్యమండలి, ప్రజానాట్యమండలి, టీటీఎఫ్, డీటీఎఫ్, టీపీటీఎఫ్, ఎన్‌జీటీయూ, బీటీఎఫ్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ఏసీఎఫ్ తదితర సంఘాలు ఏకత్రాటిపైకి వచ్చాయి. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ రచయితల వేదికను ఏదో రకంగా మట్టుబెట్టాలని చూడటం సరికాదని ప్రజాసంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. తెలంగాణ రచయితల వేదిక పని అయిపోందని , దానిని మూసుకుంటే మంచిదని తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షుడు ఒక సాహితీ సభలో మాట్లాడటం సరికాదని ప్రధానకార్యదర్శి గాగోజు నాగభూషణం పేర్కొన్నారు. ఇలాంటి హెచ్చరికలు గత ఐదేళ్ల నుండి వివిధ రూపాల్లో చేస్తూనే ఉన్నారని, తద్వారా ప్రభుత్వ, ప్రజాక్షేత్రాల్లో అనుపయోగమైన అడ్డుగీతలు గీసి, అవాంఛనీయ పరిస్థితిని పెంచి పోషించారని, వీరు ఏనాడూ జాతీయవాద దృక్పథం కలిగిన సాహితీ పరిషత్‌ల వంటి వాటిని నిలువరించలేదని అన్నారు. విప్లవ భావాలున్న విప్లవరచయితల సంఘాలను, అభ్యుదయ రచయితల సంఘాన్ని, మంజీరా రచయితల సంఘాన్నీ పల్లెత్తు మాట అనడం లేదని, తెలంగాణ సాధనకు కీలక భూమిక పోషించిన రచయితల వేదికను మాత్రం మూసుకుంటే మంచిదని ఎందుకు అనాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. రచయితల వేదిక ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలిచిందని, వారి ఆకాంక్షల కోసం పోరాడిందని, తెంలగాణ వచ్చాక కూడా పాత ఆకాంక్షల కోసం కొత్తగా ఏర్పడిన ఆకాంక్షల సాఫల్యం కోసం ప్రజలపక్షాన పోరాడుతోందని ఆయన చెప్పారు. తెలంగాణ భాషా సాహిత్యాలు, జానపద ఆదివాసీ సాహిత్య కళా సాంస్కృతిక రంగాలు, వారి జీవన రీతులు అధ్యయనం, వారి లిపి, భాష, అస్థిత్వం కోసం తమ వంతుగా కృషి చేస్తోందని అన్నారు. ఉన్న ఫళాన కొంత మందిని నిర్వాసితులుగా చేయడంపై ఎలుగెత్తుతోందని పేర్కొన్నారు. వేదికను అడ్డుకోవడం అంటే ముమ్మాటికీ స్వేచ్ఛపై ముసుగు కప్పడమేనని, అలాంటి అలాంఛనీయ ధోరణిని నిలువరించాలని ఆయన పేర్కొన్నారు.