తెలంగాణ

ప్రారంభమైన చాతుర్మాస దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: ఆధ్యాత్మిక గురువులు గురుపూర్ణిమ సందర్భంగా మంగళవారం ‘చాతుర్మాస దీక్ష’ ప్రారంభించారు. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి (చిన్న జీయర్) హైదరాబాద్ సమీపంలోని శ్రీరామ నగరం ఆశ్రమంలో చాతుర్మాస దీక్షలో ఉంటారు. అలాగే, విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, ఈ పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి రుషీకేష్‌లో చాతుర్మాస దీక్షలో ఉంటారు. ఆషాడ మాసం పౌర్ణమి అయిన మంగళవారం నుండి కార్తీక మాసం పౌర్ణమి వరకు వీరిద్దరూ చాతుర్మాస దీక్షలో ఉంటారు. రాష్ట్రంలోని ఇతర పీఠాధిపతులు కూడా చాతుర్మాస దీక్ష చేస్తున్నారు.
చిత్రం...రుషీకేష్‌లో దీక్ష ప్రారంభించిన స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర