తెలంగాణ

హైదరాబాద్ పరిసర గ్రామాలకు మంచినీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: హైదరాబాద్ పరిసరాల్లోని గ్రామాలకు దాహార్తిని తీర్చేందుకు రూ.890కోట్ల వ్యయమయ్యే ఒక ప్రణాళికను మున్సిపల్ పరిపాలన శాఖ ప్రభుత్వానికి పంపింది. ఈ ప్రతిపాదనలను హైదరాబాద్ మెట్రోడెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఏర్పాటు చేసింది. ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల ఉన్న 12 మండలాలకు మంచినీటి సరఫరా చేసేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. పది లక్షల జనాభాకు ఈ నీటిని సరఫరా చేస్తారు. మహేశ్వరం, రాజేంద్రనగర్, శంషాబాద్, మేడ్చెల్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, సరూర్‌నగర్, షామీర్‌పేట, కీసర, కుత్బుల్లాపూర్, ఘటకేసర్, రామచంద్రాపురం, పటాంచెర్వు మండలాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది. ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అపార్టుమెంట్లు ఉన్నాయి. నీటి సరఫరా నిమిత్తం 1200 కి.మీ నీటి సప్లై పథకాన్ని ఖరారు చేశారు. 30 మిలయన్ లీటర్ల కెపాసిటీ ఉన్న 15 సర్వీసు రిజర్వాయర్లను ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే మొదటి దశలో 190 గ్రామాలకు నీటి సరఫరా చేసేందుకు వీలుగా వౌలిక సదుపాయాలను కల్పించారు.