తెలంగాణ

మున్సిపల్ ఎన్నికల్లో అధిక స్థానాలను కైవసం చేసుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూలై 21: రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీలలో గట్టిపోటీ ఇచ్చి అధిక స్థానాలను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్‌ఇన్‌చార్జ్ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆదివారం సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన కుంతియా, ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను గద్దెదింపి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కొనసాగుతున్న పథకాలన్నీ కాంగ్రెస్ హయాంలో మంజూరైనవేనని వారు అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని, భవిష్యత్తు కాంగ్రెస్‌దేనన్నారు. కొత్త మున్సిపల్ చట్టంలో డైరెక్ట్‌గా చైర్మన్‌గా ఎన్నుకునే అవకాశం కల్పించి ఉంటే బాగుండేదని, ప్రజలు ఎన్నుకున్న మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లను తొలగించే అధికారాలు కలెక్టర్లకు ఇవ్వడం దుర్మార్గమన్నారు. ఏ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించలేని అసమర్థత స్థితి టీఆర్‌ఎస్‌దని విమర్శించారు. బీసీ జనాబా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేసారు. మున్సిపల్ ఎన్నికల్లో కష్టపడి గెలిపించిన ప్రతి నాయకునికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. సంగారెడ్డిలో మెడికల్ కళాశాల, సూపర్‌స్పెషాల్టీ ఆసుపత్రి ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్‌అలీ, పొన్నం ప్రభాకర్, శ్రీ్ధర్‌బాబు, మల్లు రవి, కుసుమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
షీలా దీక్షిత్ మృతికి సంతాపం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఆకాల మృతిపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు. ఆదివారం సంగారెడ్డిలో జరిగిన సమావేశంలో షీలా దీక్షిత్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి వౌనం పాటించారు.

చిత్రం... ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ చిత్రపటం ముందు నివాళులు అర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు