తెలంగాణ

‘మున్సిపల్’ ఆర్డినెన్సును ఉపసంహరించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: లోపభూయిష్టంగా ఉన్న కొత్త మున్సిపల్ చట్టాన్ని గవర్నర్ తిప్పిపంపడాన్ని బీజేపీ స్వాగతించింది. గవర్నర్ సూచించిన మార్పులతో చట్టానికి సవరణలు చేసి హడావుడిగా ఆర్డినెన్సును తేవడాన్ని బీజేపీ తప్పుబట్టింది. మంగళవారం ఇక్కడ బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మున్సిపల్ చట్టంలో విపక్ష పార్టీలు ఇచ్చే సూచనలను స్వీకరించాలన్నారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి చట్టం తేవాలన్నారు. గవర్నర్‌ను తమ పార్టీ నేతలు వెంటనే కలిసి లోపాలను వివరించడం మంచిదైందన్నారు. తమ అభిప్రాయాలతో ఇతర విపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు ఏకీభవించాయన్నారు. రాష్ట్రప్రభుత్వం హైకోర్టు అభిప్రాయాన్ని, విపక్ష పార్టీలు సూచనలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్రఫ్రభుత్వం ఎందుకు తొందరపడుతోందని ఆయన నిలదీశారు. ఈ విషయమై హైకోర్టు ప్రశ్నించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదన్నారు. ఎన్నికల సంఘం హక్కులను నిర్వీర్యం చేసే విధంగా , రాజ్యాంగానికి తూట్టుపొడుస్తూ చట్టాన్ని రూపొందించారన్నారు.
మున్సిపల్ చట్టం వెనక్కి పంపడం
కేసీఆర్ వైఫల్యానికి నిదర్శనం: కాంగ్రెస్
కొత్త మున్సిపల్ చట్టం ఆమోదానికి గవర్నర్‌కు పంపితే తిప్పి పంపడం ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఇది రాష్ట్రప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లుగా ఒంటెత్తు పోకడలతో రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. గవర్నర్ ఆ బిల్లును ఆమోదించకుండా తిరిగి పంపించారన్నారు. ఇది కేసీఆర్ పాలన వైఫల్యానికి పరాకాష్ట అన్నారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలకు, ప్రతిపక్ష పార్టీల సూచనలకు గౌరవం ఇవ్వాలన్నారు.

చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ నేత బండారు దత్తాత్రేయ