తెలంగాణ

ఉద్యోగుల క్రమబద్ధీకరణపై వారం వరకూ ఉత్తర్వులు ఇవ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 1: తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించే విషయమై వచ్చే వారం వరకు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయబోమని తెరాస సర్కారు హైకోర్టుకు తెలియజేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఉస్మానియా వర్శిటీ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదన వినిపిస్తూ, ఈ అంశంపై వచ్చే వారం వరకు తుది నిర్ణయం తీసుకోబోమని స్పష్టం చేశారు. కాగా, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడం వల్ల ఇతర విద్యార్థులు ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతారని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.సత్యం రెడ్డి వాదించారు. అనంతరం ఈ కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.్భసలే, జస్టిస్ పి.నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం ప్రకటించింది.
యుజి, పిజి సీట్లకు సెగ

మరింతగా తగ్గిన ఫీజులు
యుజి గరిష్ఠ ఫీజు నిర్ధారణ
రేపు జీవో జారీకి ఏర్పాట్లు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 1: తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో పోస్టు గ్రాడ్యూయేట్ కాలేజీలకూ సెగ తగలనుంది. ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీలను గణనీయంగా కుదించిన ప్రభుత్వం రానున్న రోజుల్లో పిజి కాలేజీలను, ఎంబిఎ, ఎంటెక్, ఎం ఫార్మసీ కాలేజీలను కుదించే పనిలో పడనుంది. ఆదివారం ఇంజనీరింగ్ కాలేజీల వ్యవహారానికి ముగింపు పలికిన తర్వాత పిజి వృత్తి విద్యా కళాశాలలపై ప్రభుత్వం దృష్టి పెట్టనున్నట్టు తెలిసింది. ఇప్పటికే ప్రసిద్ధి చెందిన కాలేజీలలో సైతం అనేక లోపాలు ఉన్నట్టు విజిలెన్స్ కమిటీలు తమ నివేదికల్లో పేర్కొనడంతో యాజమాన్యాలు కంగుతింటున్నాయి. సాధారణ కాలేజీలతో పోలిస్తే కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సౌకర్యాలు ఎక్కువగానే ఉన్నా, అక్కడున్న విద్యార్థులు- సిబ్బందితో పోలిస్తే మాత్రం అవి ఏ విధంగానూ సరిపోవని విజిలెన్స్ కమిటీలు నివేదించాయి. మరో పక్క వివాదాన్ని ఎక్కువగా పొడిగించకుండా ప్రతి కాలేజీలో ఏదో ఒక బ్రాంచిని తగ్గించుకోవడం లేదా, సీట్లను కుదించుకోవడం ద్వారా పరస్పర అంగీకారంతో అనుబంధ గుర్తింపు ఇవ్వాలని సాంకేతిక విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు. ఇంకో పక్క విజిలెన్స్ కమిటీలు ఇచ్చిన లోటుపాట్ల నివేదికలను కాలేజీల యాజమాన్యాలకు పంపించి సకాలంలో ఆ లోపాలను సరిదిద్దుకోవాలని ఆదేశించినట్టు సాంకేతిక విద్యాశాఖ అధికారి ఒకరు చెప్పారు. కాగా ఇంత వరకూ సుమారు 70 కాలేజీలకు మెయిల్స్ అందాయని కాలేజీల సంఘం అధ్యక్షుడు ఎన్ గౌతంరావు చెప్పారు.
రాష్ట్రంలో 282 ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా తగ్గనుంది. 40 కాలేజీల యాజమాన్యాలు ఈ ఏడాది అనుబంధ గుర్తింపునకు దరఖాస్తు చేయనే లేదు. దాంతో కాలేజీల సంఖ్య 242కు తగ్గింది. అందులో 24 కాలేజీల్లో చాలా లోపాలు ఉన్నట్టు విజిలెన్స్ బృందాలు నివేదించాయి. మరో 44 కాలేజీల్లో స్వల్ప లోపాలు ఉన్నట్టు తేల్చాయి. ఈ కాలేజీలు ఈ ఏడాది ఇప్పటికిప్పుడు ఆ లోపాలను భర్తీ చేసే అవకాశం లేదని తెలిసింది. అదే జరిగితే బాగా లోపాలున్న 24 కాలేజీలను పక్కన పెట్టి 218 కాలేజీలకు మాత్రమే అనుమతి మంజూరు చేసే వీలుంది. స్వల్ప లోపాలున్న 44 కాలేజీలు లోపాలను సరిదిద్దుకున్న పక్షంలో అందులో కొన్నింటికి అనుబంధ గుర్తింపు రానుందని చెబుతున్నారు. అంటే కనిష్టంగా 174, గరిష్ఠంగా 200 కాలేజీలకు ఈసారి అనుబంధ గుర్తింపు లభించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.42 లక్షల సీట్లు ఉన్నాయి. అందులో 40 కాలేజీలు తప్పుకోవడం వల్ల దాదాపు పాతిక వేల సీట్లు తగ్గాయి. బాగా లోపాలున్న 24 కాలేజీలను పక్కన పెడితే మరో 16వేల సీట్లు తగ్గుతాయి. స్వల్ప లోపాలున్న 44 కాలేజీలకు గుర్తింపు నిరాకరిస్తే సీట్లు 90 వేలకు తగ్గుతాయని పేర్కొన్నారు.
ఇంజనీరింగ్ కాలేజీల కనిష్ట ఫీజు 35వేలుగానూ, గరిష్ఠ ఫీజును 1.13 లక్షలుగా అడ్మిషన్స్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ నిర్ధారించినట్టు సమాచారం. ఎఎఫ్‌ఆర్‌సి తన సిఫార్సులను ఉన్నత విద్యామండలికి పంపిస్తుంది. ఉన్నత విద్యామండలి దానిని ఆమోదించి ఉన్నత విద్యాశాఖకు పంపిస్తుంది. ప్రభుత్వం దానిపై ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ ప్రక్రియ ఆదివారం నాటికి పూర్తవుతుందని చెబుతున్నారు.

పాలమూరు ప్రాజెక్టుల కోసం
86 వేల ఎకరాల భూ సేకరణ పూర్తి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 1: మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణం కోసం మొత్తం 96,485 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకూ 86,956 ఎకరాలు సేకరించారు. మరో 600 ఎకరాల భూమిని సేకరిస్తే, 4.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఖరీఫ్‌లోనే సాగునీటిని అందించేందుకు అవకాశం ఉంటుందని పాలమూరు భూ సేకరణ స్పెషల్ కలెక్టర్ వనజాదేవి తెలిపారు. ముందుగా ప్రకటించిన విధంగా పాలమూరులో 4.5 లక్షల ఎకరాలకు ఖరీఫ్ సీజన్‌లోనే సాగునీటిని అందించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టు ఏజెన్సీలు, ఇరిగేషన్ అధికారులు, స్థానిక శాసన సభ్యులు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా 1.50 లక్షల ఎకరాలకు, భీమా ప్రాజెక్టు ద్వారా 1.40 లక్షల ఎకరాలకు, కోయిల్‌సాగర్ ద్వారా 20 వేల ఎకరాలకు నీరు అందించనున్నారు.

తిరుమలలో ఫాస్ట్ఫుడ్ సెంటర్లు రద్దుచేయండి
డయల్ యువర్ ఇఓలో భక్తుల విజ్ఞప్తి
తిరుమల, జూలై 1: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్న భక్తులకు తాము వెళ్లాల్సిన ప్రాంతాలను తెలియజేసే మార్గాల సూచికబోర్డును ఏర్పాటుచేస్తే బాగుంటుందని విశాఖపట్నంకు చెందిన శ్రీనివాస రావు అనే భక్తుడు డయల్ యువర్ ఇ ఓలో ఇ ఓ సాంబశివరావును కోరారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో డయల్ యువర్ ఇ ఓ కార్యక్రమం నిర్వహించారు. ః భక్తులు పలు సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు తిరుమలకు వచ్చినపుడు తాము ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు. ఒక భక్తురాలు మాట్లాడుతూ తిరుమలలో ఫాస్ట్ఫుడ్ సెంటర్లను తొలగించాలని కోరారు. దీనిపై ఇ ఓ మాట్లాడుతూ ఫాస్ట్ఫుడ్ సెంటర్లతో అవసరం లేకుండా టిటిడి నాణ్యమైన అల్పాహార, భోజన సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. ఫాస్ట్ఫుడ్ సెంటర్లకు కొత్తగా అనుమతి ఇవ్వబోమన్నారు. శ్రీవారి సేవకుల్లో విద్యావంతులకు మాత్రమే అవకాశం ఇవ్వాలని కోరగా క్రమశిక్షణ, భక్తి భావం పెంపొందించేందుకు శ్రీసత్యసాయి సేవా సంస్థ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నామని ఇవో చెప్పారు.