తెలంగాణ

‘సాగర్’ భద్రత కట్టుదిట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, జూలై 1: నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై రెండు రోజులుగా భద్రతను పెంచామని నాగార్జునసాగర్ డ్యాం భద్రత అధికారి రమణారెడ్డి తెలిపారు. హైద్రాబాద్‌లో ఉగ్రవాద సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో రాష్టవ్య్రాప్తంగా పోలీసుశాఖ ఇంటెలిజెన్స్ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ పర్యాటక కేంద్రం, బహళార్థ సాధక ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై నిఘాను పెంచారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ సాగర్ ప్రాజెక్టు పరిదిలోని ఎడమకాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్ద, సాగర్ ప్రధాన డ్యాంపైన, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘాను పెంచామని, సిబ్బందిని అలర్ట్ చేశామని తెలిపారు. ప్రత్యేకంగా వేరే సిబ్బందిని ఏర్పాటుచేయకపోయినా ఎస్‌పిఎఫ్ సిబ్బందినే అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం సాగర్ డ్యాం వద్ద ఎటువంటి ఉద్రిక్త పరిస్థితిలేదని ప్రశాంతంగా ఉందని తెలిపారు. అయితే, నాగార్జునసాగర్ ప్రధాన ద్వారం వద్ద శుక్రవారం ఎస్‌పిఎఫ్ సిబ్బంది ఒకరిద్దరు తప్ప ఎవరూ కనిపించలేదు. ఉన్నవారు కూడా అప్రమత్తంగా లేకపోవడం శోచనీయం. దీనిపై భద్రత అధికారిని వివరణ కోరగా ఒక హెడ్‌కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుళ్లతో ప్రధాన ద్వారం వద్ద విధులు నిర్వహింపచేస్తున్నామని అప్రమత్తంగా ఉన్నారని చెప్పడం గమనార్హం.