తెలంగాణ

పుష్కరాలకు అర్చకుల కొరత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 3: కృష్ణా పుష్కరాల పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు అవసరమైనంత సంఖ్యలో అర్చక పండితులు లేకపోవడం నల్లగొండ జిల్లాలో సమస్య్యగా మారింది. ఆగస్టు 12 నుండి 23 వరకు జరిగే ఈ పుష్కరాలకు కోటి మందికి పైగా భక్తులు జిల్లా పరిధిలోని ఘాట్‌లకు రావచ్చని భావిస్తున్నారు. పుణ్యస్నానాల పిదప భక్తులు తమ పూర్వీకులకు పిండ ప్రధానాలు, పితృ తర్పణాల ప్రక్రియలు నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో అర్చక పండితులు అవసరమవుతారు. భక్తుల రద్ధీకి అనుగుణంగా పూజాదికాలు, తీర్ధప్రసాదాల వితరణకు, అలాగే నదీ హారతులకు, మహిళలు నదిలో దీపాలు వదిలే ప్రక్రియ పూజల నిర్వహణకు భారీ సంఖ్యలోనే అర్చక పండితుల అవసరముంది. కాగా, ప్రస్తుతం జిల్లా పరిధిలో కేవలం 2500 మంది వరకు మాత్రమే అర్చక పండితులున్నారని జిల్లా బ్రాహ్మణ, అర్చక సంఘాల నేతలు చెబుతున్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా 10 వేల మందికి పైగా అర్చక పండితుల అవసరముందని, ఇందుకోసం ఇతర జిల్లాల నుండి అర్చక పండితులను రప్పించాలని అర్చక సంఘాలు కోరుతున్నాయి. అయితే దేవాదాయ శాఖతో పాటు జిల్లా యంత్రాంగం ఇప్పటిదాకా కృష్ణా పుష్కరాల కోసం అర్చకులను సమకూర్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఈ వ్యవహారంపై దేవాదాయ శాఖ ఇన్‌చార్జి అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరావు స్పందిస్తూ, ఇతర జిల్లాల నుండి అర్చక పండితులను రప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణా పుష్కరాల అర్చకుల పేర్లు నమోదు చేసి వారికి గుర్తింపు కార్డులు జారీ చేస్తామన్నారు.