తెలంగాణ

గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యం కండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఆ యా గ్రామాలకు చెందిన ఉన్నతస్థానాల్లో ఉంటున్న వ్యక్తులు కూడా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్ గుడిసెల రాజేశంగౌడ్ కోరారు. గ్రామాల అభివృద్ధిపై కమిషన్ సభ్యుడు చెన్నయ్యతో చర్చలు జరిపారు. దాదాపు మూడున్నర కోట్ల జనాభా కలిగిన తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రభుత్వం అనేక రూపాల్లో నిధులు ఖర్చు చేస్తోందన్నారు. అయినప్పటికీ గ్రామాల్లో పరిస్థితి మారాల్సి ఉందన్నారు. తాగునీటి సరఫరా, రోడ్ల నిర్మాణం, కూలీలకు ఉపాధి కల్పించడం, గృహనిర్మాణం, సబ్సిడీపై బియ్యం తదితర నిత్యావసర సరకులను ఇవ్వడం, సామాజిక పింఛన్లు ఇవ్వడం, విద్య, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయడం తదితర రంగాల్లో మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం ఎక్కువ నిధులు ఇవ్వాలంటూ తమ కమిషన్ కూడా కోరుతుందన్నారు. ఇన్ని విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధ్యం కాలేదని రాజేశం గౌడ్ తెలిపారు. ఈ పరిస్థితిలో ఆ యా గ్రామాలకు చెందిన వారు ఉద్యోగం, ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళుతుంటారని (ఎన్‌ఆర్‌ఐ), పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ మెరుగైన జీవితం గడుపుతుంటారని, ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేస్తుంటారని రాజేశంగౌడ్, సభ్యుడు చెన్నయ్య గుర్తు చేశారు. ఎన్‌ఆర్‌ఐలు ఇతరులు తమ సొంత గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు ఇవ్వవచ్చని రాజేశంగౌడ్ సూచించారు. అభివృద్ధికి ఇతర రూపాల్లో కూడా సహకరించవచ్చని పేర్కొన్నారు. గ్రామాల్లో అనేక సమస్యలు ఉంటాయని, ప్రజలకు మెరుగైన వౌలికసదుపాయాలు కల్పించాల్సి ఉంటుందన్నారు. అందుకే ఆ యా గ్రామాలకు చెందిన ఉన్నతస్థానాల్లోని వారు బాధ్యతగా భావించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఇలా ఉండగా, రాజేశంగౌడ్ ఆదివారం మాజీ మంత్రి, ఆర్టీసీ చైర్మన్ ఎం. సత్యనారాయణరావు, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డిల గృహాలకు వెళ్లి వారితో వివిధ అంశాలపై చర్చలు జరిపారు.