తెలంగాణ

దమ్ముంటే ఎంఐఎంతో పొత్తు రద్దు చేసుకో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండునాల్కల ధోరణిని మానుకోవాలని ఎఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ హితవుపలికారు. టీఆర్‌ఎస్‌తో ఉంటే దేశ భక్తులు, తెలంగాణవాదులు లేదంటే దేశ ద్రోహులు అనే అర్థం వచ్చేలా మాట్లాడడం తగదన్నారు. ప్రశ్నించే స్థాయి లేకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదమనే చిలుక కబుర్లు చెప్పిన కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు పార్టీలో చేర్చుకున్నారన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేశారని ఆయన విమర్వించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈ నీతి సూత్రం గుర్తుకు రాలేదా అని అడిగారు. ప్రజాస్వామ్య విలువలు గురించి మాట్లాడిన మీరు తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీలో, కౌన్సిల్‌లో కనీసం ప్రతిపక్షం లేకుండా చేయడం మీ హిపోక్రసీకి నిదర్శనం కాదా అని నిలదీశారు. మత రాజకీయాలు వద్దని చెబుతున్న కేటీఆర్ ఎంఐఎంతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ఆయన అన్నారు. ప్రజలను మోసం చేయడం మానుకోవాలన్నారు. నిజంగా దమ్ముంటే ఎంఐఎంతో పొత్తును రద్దు చేసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం మతోన్మాద రాజకీయాలకు పాల్పడినట్లు భావిస్తే 370వ ఆర్టికల్ రద్దు, త్రిపుల్ తలాక్, సమాచార హక్కు సేకరణ చట్టం సవరణ అంశాలపై ఎందుకు మద్దతు ఇచ్చారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల విజ్ఞతను తక్కువగా అంచనా వేయరాదన్నారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శించే అర్హత బీజేపీకి లేదన్నారు. 103 అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీకి ఎలా బలపడుతుందన్నారు. నాలుగు ఎంపీ స్థానాల్లో అనుకోకుండా గెలవగానే బీజేపీ ఏదో ఊహించుకుంటోందన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ రెండూ తోడు దొంగలని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రంలోని అన్ని అంశాలకు టీఆర్‌ఎస్ మద్దతు ఇస్తోందని, లోపాయికారిగా బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య పొత్తు ఉందని, ప్రత్యర్థులమనుకుంటూ నాటకాలాడుతున్నారన్నారు.