తెలంగాణ

మున్సి‘పోల్’లో కేసీఆర్‌కు భంగపాటు తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడచినా, ఇంతవరకు పూర్తి స్థాయి బడ్జెట్ లేదని, కేసీఆర్ దివాళాకోరు విధానాలకు నిదర్శనమని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజాస్వామ్యం మనుగడ, ప్రశ్నించే గళాలపై మాట్లాడడం చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గాడితప్పిందని ఆయన విమర్శించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో గత ఎనిమిది నెలల్లో నెలకొన్న పరిణామాలనువిశే్లషిస్తే పరిపాలన గాడి తప్పిందని, వ్యక్తిపూజ పెరిగిందని, నియంతృత్వ శక్తులు పెచ్చుమీరాయన్నారు. పరిపాలనపై కేసీఆర్‌కు పట్టులేదన్నారు. ఎవరేమి చేస్తున్నారనే అంశంపై ప్రభుత్వానికి అవగాహన లేకుండా పోయిందన్నారు. నిరంకుశ, నియంతృత్వ పోకడలతో టీఆర్‌ఎస్ పార్టీ విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అనేక సమస్యలపై రాష్ట్రప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించలేదన్నారు. ప్రతిపక్ష పార్టీలను విశ్వాసంలోకి తీసుకోవడం లేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే సచివాలయం, అసెంబ్లీ చక్కగా సరిపోతే, విభజన తర్వాత ఎందుకు సరిపోవన్నారు. సచివాలయాన్ని కూల్చడం దుందుడుకు ధోరణి అన్నారు. ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయకుండా, సచివాలయాన్ని కూల్చి రూ.600 కోట్లను ఖర్చుపెట్టడం ఎందుకన్నారు.
టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గుతోందన్నారు. దీంతో మజ్లిస్ పార్టీ పొత్తుతో ఒక వర్గం ప్రజలను ఓటు బ్యాంకుగా మార్చుకోవాలన్న ఆలోచన సరైంది కాదన్నారు. ఎంఐఎం పార్టీతో అంటకాగుతూ, మెజారిటీ సమాజంపై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయడంపై ప్రజల ఆగ్రహాన్ని టీఆర్‌ఎస్ గత లోక్‌సభ ఎన్నికల్లో చూసిందన్నారు. ప్రజలు తమ హక్కును తెలియచేసేందుకు ఎంచుకున్న ధర్నా చౌక్‌ను ఎత్తేయడం దుర్మార్గమన్నారు. 370 ఆర్టికల్ రద్దుతో దేశంలో అనేక మార్పులు వస్తున్నాయని, ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఈ మార్పును చూసి సహించలేక టీఆర్‌ఎస్ బీజేపీపై అనుచిత విమర్శలు చేస్తోందన్నారు. జాతీయవాదాన్ని మతతత్వవాదంగా చిత్రీకరించే ధోరణిని మానుకోవాలని ఆయన హితవుపలికారు.