తెలంగాణ

కొత్త జిల్లాలకు మహనీయుల పేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జులై 3: కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న జిల్లాల్లో తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రదాతలు, పోరాట యోధులైన దొడ్డి కొమరయ్య, కొమరం భీం పేర్లు పెట్టాలని బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. దొడ్డి కొమరయ్య 70వ వర్ధంతి సందర్భంగా రచయిత, జర్నలిస్టు మరిపాల శ్రీనివాస్ రాసిన పుస్తకాన్ని కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ ప్రసంగిస్తూ ఈ విషయమై తాను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసి కోరతానని చెప్పారు. తెలంగాణ చరిత్రను మహాగ్రంధంగా తీసుకుని రావాల్సిన అవసరం ఉందని అన్నారు. దొడ్డి కొమరయ్య స్పూర్తితో సామాజిక తెలంగాణ కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య పోరాటం చేసి తూటాలకు బలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం కోసం, రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఎంత మంది అసువులు బాసారని ఆయన తెలిపారు. వీరిలో ఒకరైన దొడ్డి కొమరయ్య జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో పొందుపరచాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యమం స్వార్థం కోసం జరిగింది కాదని దత్తాత్రేయ చెప్పారు.
పెత్తందారులకు వ్యతిరేకంగా..
టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రసంగిస్తూ, నిజాం ప్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య పోరాటం చేసి అసువులు బాసారని అన్నారు. ఇటువంటి చరిత్రను ఎప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు.
ఫిరాయింపులపై విహెచ్ ఆగ్రహం
ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపక్షాలు లేకుండా చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధి తన గడువు ముగియక ముందే పార్టీ ఫిరాయిస్తే, అదే రోజు సభ్యత్వం కోల్పోయేలా కఠినమైన చట్టం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
బంగారు తెలంగాణ సినిమా..
ఎఐసిసి నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రసంగిస్తూ కొత్తగా నిర్మించబోయే ప్రాజెక్టుల్లో ఏదైనా ఒక ప్రాజెక్టుకు దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ సినిమా చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. అంతా కాంట్రాక్టర్ల రాజ్యం నడుస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. ఇంకా ఈ సమావేశంలో అభ్యుదయ రచయితల సంఘం నాయకుడు కెవిఎల్, రవి, ప్రభంజన్, తిప్పర్తి యాదయ్య, జర్నలిస్టు పి. యాదగిరి, దొడ్డి బిక్షపతి, గురువయ్య తదితరులు ప్రసంగించారు.

చిత్రం.. పుస్తకావిష్కరణ కార్య క్రమంలో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు