తెలంగాణ

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 16: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శనానికి, ఆలయ పునర్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు శనివారం యాదాద్రికి రానున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ యాదాద్రికి చేరుకోనుండగా ఆయన వెంట దేవాదాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి కూడా రానున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎం కేసీఆర్ తన యాదాద్రి పర్యటనలో భాగంగా లక్ష్మీనరసింహుడి నూతన ఆలయం పనుల పురోగతిని, టెంపుల్ సిటీ నిర్మాణ పనులను, కాటేజీల నిర్మాణ పనులు, నవగిరుల అభివృద్ధి పనులను పరిశీలించి సమీక్షిస్తారు. ఆలయ ప్రారంభానికి ముందు కొండపై మహా సుదర్శన యాగం, సహస్రకుండాత్మక యాగం నిర్వహించ తలపెట్టిన సీఎం కేసీఆర్ యాగ నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి ఆలయ అధికారులకు సూచనలు చేయనున్నారు. ఇప్పటికే యాదాద్రి నిర్మాణ పనులకు సంబంధించి ఆగమశాస్త్ర సలహాదారుగా ఉన్న త్రిదండి చినజీయర్ స్వామితో యాదాద్రిలో మహాసుదర్శన యాగం నిర్వహణపై చర్చించిన సీఎం కేసీఆర్ యాగం నిర్వహణ తేదీలను అధికారులకు సూచించి వారికి యాగ నిర్వాహణ ఏర్పాట్లపై మారదర్శకం చేస్తారు. మహా సుదర్శన యాగానికి పలువురు పీఠాధిపతులతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను సైతం ఆహ్వానించనున్నందున వారికి అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తారు. సీఎం కేసీఆర్ నేటీ యాదాద్రి పర్యటనకు అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. కేసీఆర్ యాదాద్రికి హెలిక్యాప్టర్‌లో వస్తారా లేక రోడ్డు మార్గంలో వస్తారోనన్న దానిపై స్పష్టత లేకపోవడంతో అటు హెలీప్యాడ్ స్థలాలను సిద్ధం చేయడంతో పాటు రోడ్డు మార్గంలో అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక గత ఫిబ్రవరి మూడో తేదీన మొదటిసారి యాదాద్రి సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనుల పరిశీలనకు పక్షం రోజుల్లో యాదాద్రికి మళ్లీ వస్తానని, ఇక మీదట నెలకు రెండుమూడు పర్యాయాలు వస్తానని కేసీఆర్ ప్రకటించినప్పటికీ ఐదున్నర నెలల పిదప తిరిగి యాదాద్రికి వస్తున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో మొత్తం మీద గడిచిన ఐదేళ్లలో పదిసార్లు యాదాద్రి సందర్శించారు. నేడు పదకొండవసారి యాదాద్రి సందర్శనకు వస్తున్నారు. సీఎంగా కేసీఆర్ తొలిసారి 2014ఆక్టోబర్ 17న యాదాద్రి సందర్శించారు. అదే ఏడాది డిసెంబర్ 17న మరోసారి యాదాద్రి సందర్శించిన కేసీఆర్ 1000 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు ప్రకటించారు. అనంతరం 2015 ఫిబ్రవరి 25న, ఫిబ్రవరి 27న, అదే ఏడాది మార్చి 5న యాదాద్రికి వచ్చారు. 2015మే 30న గవర్నర్ నరసింహన్, త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి యాదాద్రి నూతన ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించారు. 2015 జూలై 5న రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీతో కలిసి మరోసారి కేసీఆర్ యాదాద్రి సందర్శించారు. తిరిగి 2016 మార్చి 17న బ్రహ్మోత్సవాలకు, ఆక్టోబర్ 19న ఆలయ అభివృద్ధి పనుల పురోగతి పరిశీలనకు, 2017 నవంబర్ 24న ఆలయ నిర్మాణ పురోగతి పరిశీలనకు సీఎం కేసీఆర్ యాదాద్రి సందర్శించారు. రెండోసారి సీఎంగా ఈ ఏడాది ఫిబ్రవరి 3న యాదాద్రి సందర్శించిన సీఎం కేసీఆర్ నేడు పదకొండవసారి యాదాద్రి రానుండటం ఆలయ నిర్మాణ పనుల పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనం. కాగా సీఎం కేసీఆర్ నేటీ యాదాద్రి పర్యటన సందర్భంగా పోలీస్ యంత్రాంగం ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. కొండపైకి వెళ్లే అన్ని మార్గాలను పోలీస్ శాఖ తమ ఆధీనంలోకి తీసుకుంది. పెద్దగుట్టపైన, వడాయిగూడెం వద్ద హెలీప్యాడ్ స్థలాలను సిద్ధం చేసి భద్రత ఏర్పాట్లు చేపట్టారు.
సీఎం రాక సందర్భంగా కొండపైకి ఇతరులు ఎవరినీ అనుమతించబోమని, కొద్దిసేపు దుకాణాలు సైతం మూసివేయాల్సివుంటుందని పోలీసులు తెలిపారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహిస్తూ రాచకొండ పోలీస్ అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.