తెలంగాణ

ఎస్పీ ఇంట అతిథ్యం.. పులకించిన గిరిజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 4: బాహ్య ప్రపంచానికి దూరంగా దట్టమైన కీకారణ్యంలో జీవించే ఆదిమ గిరిజనులు సోమవారం తొలిసారి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుని తమ సమస్యలు ఏకరవు పెడుతూనే అధికారులతో ఆడుతూ పాడుతూ ఆనందడోలికల్లో మునిగితేలారు. ఇటీవల ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విక్రమ్‌జిత్ దుగ్గల్ జిల్లాలోని తిర్యాణి మండలం గుండాల గ్రామానికి కాలినడకన వెళ్ళి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు సౌకర్యం లేని ఈ గ్రామం అభివృద్ధికి ఆమడదూరంలో ఉండడం రోగం, నొప్పి, చదువు, తదితర సామాజిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆ గ్రామాన్ని చూసి చలించిపోయారు. అడవులే జీవనాధారంగా పోడు వ్యవసాయంతో దుర్బర జీవితాలు అనుభవిస్తున్న గిరిజనులను దుగ్గల్ ఒకసారి జిల్లాకేంద్రానికి రావాలని, సమస్యలను ఒకొక్కటి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీ ఆహ్వానం మేరకు సోమవారం గుండాల గ్రామానికి చెందిన గ్రామస్థులు 71 మంది పోలీసులు సమకూర్చిన వాహనంలో ఆదిలాబాద్ రాగా వారిలో 26 మంది మహిళలు కూడా ఉండడం విశేషం. సాదరంగా ఎస్పీ దుగ్గల్ వారిని ఆప్యాయంగా ఆహ్వానించి, ముందుగా వారందరికీ భోజనం ఏర్పాటు చేశారు. నేలపై కూర్చుని భోజనం చేసే గిరిజనులతో ఎస్పీ కూడా వారితో కలిసి భోజనం చేస్తూ వారి గురించి, పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. రోడ్డు సౌకర్యం లేకపోవడమే అభివృద్ధికి అవరోధంగా మారిందని, తమ ఇక్కట్లు తొలగించాలని ఎస్పీకి సూచించారు. ఆ తర్వాత కాసేపు సేదతీరిన గిరిజనులు ఆనందంతో సంప్రదాయ గిరిజన పాటలతో నాట్యం చేస్తూ మైమరిచిపోయారు. వారి ఆనందంలో పాలుపంచుకుంటూ ఎస్పీ సైతం లయబద్ధంగా చిందులు వేస్తూ తన్మయత్వానికి లోనయ్యారు. ఆ తర్వాత ఆయన వారందరిని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపించారు. ఫిర్యాదుల విభాగంలో ఉన్న కలెక్టర్ జగన్మోహన్ తొలిసారిగా జిల్లా కేంద్రానికి వచ్చిన గుండాల గ్రామస్థుల సమస్యలను ఓపిగ్గా విన్నారు. ఎస్పీ సూచనను కూడా పరిగణలోకి తీసుకున్న కలెక్టర్ గుండాల నుండి దండేపల్లి వరకు 15 కిలోమీటర్ల రోడ్డు సౌకర్యం కల్పిస్తామని, వారిలో భరోసానింపారు. జిల్లా దుగ్గల్ చూపించిన అప్యాయత, అతిధి మర్యాదలతో ఉప్పొంగిపోయిన ఆదిమ గిరిజనులు తమ జీవితంలోనే గొప్ప అనుభూతి చవిచూశామని ఆనందం వ్యక్తం చేశారు.