తెలంగాణ

నీలగిరి జక్కన్నకు ప్రోత్సాహమేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 4: కరకు శిల్పాలకు ఉలితో ప్రాణం పోసి దేవుళ్లుగా తీర్చిదిద్దే నీలగిరి (నల్లగొండ) జక్కన్నకు తాను నమ్ముకున్న శిల్పకళ బతుకు భరోసా ఇవ్వలేకపోతోంది. అరుదైన శిల్పకళను తనకు దాసోహం చేసుకున్న యువకుడు చౌడోజు నరసింహచారి (21) నైపుణ్యం మబ్బుచాటు చంద్రుడిలా మసులుతోంది. నల్లగొండ మండలం అనే్నపర్తి గ్రామానికి చెందిన నరసింహాచారి తన పెదనాన్న యాదగిరి శిల్పాలను చెక్కుతున్న తీరుకు ఆకర్షితుడై ఎనిమిదేళ్ల ప్రాయం నుండే ఉలి పట్టి రాళ్లను చెక్కడం ఆరంభించాడు. శిల్పకళపై ఉన్న మక్కువ అతడిని ఇంటర్మీడియట్ పూర్తయ్యేసరికల్లా శిల్పకళాకారుడిని చేసింది. తండ్రిలేని తనకు అన్నీ తానై పోషించిన పెదనాన్న ఆకస్మిక మరణంతో నరసింహాచారి ఒకవైపు డిగ్రీ చదువు కొనసాగిస్తూనే ఇంకోవైపు సొంతంగా ఇంటి వద్దనే శిల్పాలను చెక్కుతూ శిల్పకళనే జీవనోపాధిగా మలుచుకున్నాడు. చిన్న సైజుతో పాటు మూడు ఫీట్లు, ఆపై సైజులో ఉండే దేవతా విగ్రహాలను నెల రోజుల్లో పూర్తి చేసే నైపుణ్యం సాధించాడు. నరసింహాచారి శిల్పకళా నైపుణ్యానికి హిందూ దేవతల విగ్రహాలు, దేవతల వాహనాలు, బలిపీఠాలు, బొడ్రాయిలను అద్భుతంగా చెక్కిన తీరే నిదర్శనం. చిత్రంగా నరసింహాచారి పెదనాన్న సైతం మొదటి నుండి శిల్పకళాకారుడు కాదు. ఆయన మాచర్ల దుర్గిలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లిన సందర్భంలో అక్కడ శిల్పులను చూసి స్వతహాగా సాధనతో శిల్పకళను సొంతం చేసుకుని ముప్పై ఏళ్ల పాటు అదే వృత్తిని కొనసాగించాడు. పెదనాన్న దారిలోనే నరసింహాచారి కూడా ఏకలవ్యుడిగా శిల్పకళా నైపుణ్యం సాధించడం విశేషం.
విగ్రహాల కోసం దుర్గి నుండి లారీల ద్వారా నాపరాళ్లను తెప్పించుకుంటున్న నరసింహాచారికి శిల్పకళా తగిన జీవనోపాధిని అందించలేపోతోంది. టన్నుకు రూ.7 వేలు చెల్లించి రాళ్లను కొనుగోలు చేసి వాటిని విగ్రహాలుగా మలిచి విక్రయిస్తున్నాడు. రాళ్ల రవాణా, దిగుమతి ఫీజులు భారంగా మారాయి. దేవాదాయ శాఖ నుండి తనకు శిల్పకారుడిగా గుర్తింపు కార్డునిస్తే రాళ్ల దిగుమతిలో ఆర్థిక భారం తగ్గేదని నరసింహాచారి వాపోయాడు.
నరసింహాచారి చెక్కిన దేవతా విగ్రహాలు