తెలంగాణ

బీ వినోద్‌ను ఎలా పిలుస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ పార్లమెంటు సభ్యుడు బీ వినోద్ కుమార్‌ను నియమించడంతో పాటు శాశ్వత ఆహ్వానితుడిగా మంత్రివర్గ సమావేశాల్లో పాల్గొనేవిధంగా ఉత్తర్వులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి పేర్కొన్నారు. గతంలో ప్రణాళిక సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి హోదాలో ఎవరిని మంత్రివర్గ సమావేశాలకు పిలువలేదన్నారు. మంత్రివర్గ సమావేశాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రికి కోరి కంటే నేరుగా మంత్రిగానే నియమించుకోవచ్చన్నారు.
ముఖ్యమంత్రి మంత్రులు కాని వారిని శాశ్వతం ఆహ్వానితుడిగా మంత్రివర్గ సమావేశానికి పిలవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇది ఒక దుష్టసంప్రదాయానికి నాంది పలికినట్లవుతుందన్నారు. మంత్రివర్గ సమావేశాలకు కేంద్రంలో, రాష్ట్రాల్లో మంత్రివర్గ హోదా ఉన్న మంత్రులనే పిలవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సహాయ, డిప్యూటీ మంత్రులను కూడా సాధారణంగా సమావేశాలకు ఆహ్వానించడం జరగదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సంప్రదాయాన్ని తుంగలో తొక్కడం, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి రోజూవారీగా చేసే సమీక్ష సమావేశాల్లో కూడా ఆయా అంశాలతో సంబంధం లేని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను కూర్చొబెట్టుకుని మరీ సమీక్షించడం సరైన విధానం కాదన్నారు. దీనిపై ఉన్నతాధికారులు కూడా లోలోపల ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి తెలుసుకుని తప్పును సరిదిద్దుకుంటే మంచిదన్నారు. ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశాలు, సమీక్ష సమావేశాలకు సంబంధిత మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులనే ఆహ్వానించాలని, సంబంధంలేని వారిని పిలిచే దుస్సంప్రదాయాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.