తెలంగాణ

బాలిక హత్య కేసులో నిందితుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4: నార్త్‌జోన్ పరిధిలోని బొల్లారంలో ఓ మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో నిందితుడు అనిల్‌కుమార్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కళాసిగూడకు చెందిన మైనర్ బాలిక సరితను అదే ప్రాంతానికి చెందిన అనిల్‌కుమార్ మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. తన బండారం ఎక్కడ బయటపడుతుందోనని బాలికను గొంతునులిమి హత్య చేసిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చిన విషయం విధితమే. ఈ కేసులో పాత నేరస్థుడు అనిల్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిసిపి సుమతి మాట్లాడుతూ, నిందితుడు అత్యాచారం, హత్యకు పాల్పడినట్టు బలమైన ఆధారాలు లభించాయని చెప్పారు. పక్కా ప్రణాళికతోనే బాలికను ఎత్తుకెళ్లి అనిల్ దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడు అనిల్‌కుమార్‌పై పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 19 కేసులు నమోదై ఉన్నాయని డిసిపి తెలిపారు. జూలై ఒకటిన జైలు నుంచి విడుదలై వచ్చి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని, అన్ని ఆధారాలతో నిందితుడు అనిల్‌కుమార్‌ను కోర్టులో ప్రవేశపెడతామని డిసిపి పేర్కొన్నారు.
ఇదిలావుంటే, మైనర్ బాలికపై అత్యాచారం, హత్యను నిరసిస్తూ సోమవారం డిసిపి కార్యలయం ఎదుట మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. నిందితుడు అనిల్‌కుమార్‌పై నిర్భయ కేసు పెట్టడంతో పాటు అతడిని ఉరి తీయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. నగరంలో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, మహిళపై వేధింపులు, అత్యాచార, హత్యలు జరగకుండా నివారించాలని మహిళా సంఘాలు పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశాయి.

కేసు వివరాలను వెల్లడిస్తున్న డిసిపి సుమతి, అనిల్‌ను శిక్షించాలని ఆందోళనకు దిగిన మహిళా సంఘాలు