తెలంగాణ

‘ఆరోగ్యశ్రీ’ సమ్మె విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఐదు రోజులుగా కొనసాగుతోన్న ఆరోగ్యశ్రీ సేవల నిరాకరణ సమ్మెను విరమిస్తున్నట్టు నెట్‌వర్క్ ఆస్పత్రులు మంగళవారం రాత్రి ప్రకటించాయి. సచివాలయంలో వైద్యఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో జరిగిన చర్చలు ఫలించడంతో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించనున్నట్టు నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రకటించాయి. చర్చల అనంతరం మంత్రి ఈటల మీడియాతో మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ సేవల పునరుద్ధరణకు ప్రైవేట్ ఆస్పత్రులు అంగీకరించినట్టు తెలిపారు. ఇప్పటి వరకు ప్రైవేట్ ఆస్పత్రులకు రూ. 560 కోట్లు చెల్లించామని, ఇంకా 490 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. వీటిని దశల వారీగా చెల్లిస్తామన్నారు. ప్రతినెల చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకపోవడం వల్ల తెలంగాణ వ్యాప్తంగా చిన్న చిన్న ఆస్పత్రులకు ఇబ్బంది కలుగకూడదనే రూ.520 కోట్లు చెల్లించామన్నారు. భవిష్యత్‌లో ప్రతినెల బిల్లులు చెల్లించనున్నట్టు మంత్రి తెలిపారు. అలాగే 2007-12 మధ్య కాలానికి కుదుర్చుకున్న ఒప్పందాన్ని పున:సమీక్షించడానికి కూడా హామీ ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానూకూలంగా స్పందించడంతో సమ్మెను విరమించినట్టు తెలంగాణ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసొసియేషన్ అధ్యక్షుడు రాకేశ్‌రెడ్డి ప్రకటించారు. ఆరోగ్యశ్రీ వల్ల మూడున్నర కోట్ల మంది ప్రజలు లబ్ధిపొందుతున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కుదుర్చుకున్న ఒప్పందాల్లోని లొసుగుల వల్లనే తాము ఇబ్బందిపడినట్టు రాకేశ్‌రెడ్డి వివరించారు.
చిత్రం...నెట్‌వర్క్ ఆసుప్రతుల సంఘ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్