తెలంగాణ

హరిత చరితం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4: హరితహారం క్రతువును 8న సిఎం కెసిఆర్ నల్లగొండ జిల్లాలో ప్రారంభించనున్నారు. అదేరోజు అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే రహదారిపై నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద సిఎం మొక్కలు నాటి కార్యక్రమం ప్రారంభిస్తారని సిఎంవో వెల్లడించింది. విజయవాడ జాతీయ రహదారిపై రాష్ట్ర సరిహద్దు వరకూ సుమారు 165 కిలోమీటర్ల దారి పొడవునా ఇరువైపుల 85వేల పూల, నీడ నిచ్చే మొక్కలు నాటాలని ప్రభుత్వం సంకల్పించింది. అలాగే అదే రహదారిపై రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలోని అబ్దుల్లాపూర్ మెట్ నుంచి నల్లగొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వరకూ మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రహదారిని 14 సెగ్మెంట్లుగా విభజించి ఒక్కో సెగ్మెంట్‌కు ప్రత్యేక అధికారిని ఇంచార్జిగా ప్రభుత్వం నియమించింది. రాష్టవ్య్రాప్తంగా 8నుంచి రెండు వారాలపాటు కొనసాగనున్న హరితహారం కార్యక్రమం పర్యవేక్షణ బాధ్యతలను ఓఎస్‌డి ప్రియాంక వర్గీస్‌కు అప్పగించారు. స్వయం సహాయక బృందాల సభ్యులు, విద్యార్థులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటనున్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర సరిహద్దు వరకూ ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు, 10 మండలాలు, 50 గ్రామాల ప్రజలు హరితహారంలో పాల్గొనేలా కార్యక్రమాన్ని రూపొందించారు. జాతీయ రహదారిపై నిర్వహించనున్న హరితహారంలో మొక్కలు నాటే వారికి మొక్కల పంపిణీ కోసం అటవీశాఖ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో ఒకేరకమైన పూల మొక్కలు కాకుండా పది కిలోమీటర్ల వరకు ఒక రకం, తర్వాత పది కిలోమీటర్ల వరకూ మరోరకం మొక్కలను నాటేలా కార్యక్రమాన్ని రూపొందించారు. రాష్ట్రం నుంచి వెళ్లే అన్ని జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రాష్ట్ర సరిహద్దు వరకూ అందమైన పూలమొక్కలు, పచ్చదనాన్ని ఆస్వాధించేలా చెట్లను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఔషధ మొక్కల పంపిణీకూడా...
పండ్లు, పూలు, నీడనిచ్చే మొక్కలతోపాటు ఔషధ మొక్కలను హరిత హారంలో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలు తమకు ఇష్టమైన మొక్కలు నాటేలా అన్ని రకాలను అందుబాటులో ఉంచాలని అటవీశాఖ అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఈనెల 11న హైదరాబాద్‌లో కెబిఆర్ పార్క్, శంషాబాద్ ఎయిర్ పోర్టు, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, హైటెక్ సిటీ, చార్మినార్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాట్లు చేసి ప్రజలకు మొక్కలను పంపిణీ చేయాలని సిఎం ఆదేశించారు.
chitram...
హరితహారంలో పంపిణీకి సిద్ధమవుతున్న మొక్కలు