తెలంగాణ

24న సామాజిక న్యాయంపై సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: ఫోరం ఫర్ సోషల్ జస్టీస్ ఆధ్వర్యంలో ఇండియన్ కమ్యూనిజం సోషల్ జస్టిస్ అనే అంశంపై ఈ నెల 24వో తేదీన ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో సెమిరా నిర్వహిస్తున్నట్టు ఎంసీపీఐ (యు) ప్రధానకార్యదర్శి ఎండీ గౌస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డీ రాజా , ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, టీ మాస్ చైర్మన్ కంచె ఐలయ్య , సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్‌పర్సన్ మల్లేపల్లి లక్ష్మయ్య హాజరవుతారని అన్నారు. భారతదేశంలో నూటికి 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఆర్ధిక, రాజకీయ , సామాజిక సమన్యాయం సాధించాల్సి ఉందని, గత ప్రభుత్వాలతో పాటు ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కూడా వెనుకబడిన సామాజిక వర్గాలను రాజకీయ ఆర్ధిక సామాజిక అణచివేతకు గురిచేస్తున్నాయని అన్నారు. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా సామాజిక శక్తులను ఐక్యం చేసి రాజ్యాధికారాన్ని సాధించాల్సి ఉందని, వీరి ఐక్యతకు సామాజిక ఉద్యమాల బలోపేతం చేయడానికి వామపక్ష , కమ్యూనిస్టులే పూనుకోవల్సి ఉందని అన్నారు. దేశంలో మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా సీపీఐ, ఎంసీపీఐ వంటి కమ్యూనిస్టు పార్టీలలో సామాజిక వర్గాలు ఉన్నతమైన నాయకత్వ స్థానానికి వస్తున్న ఈ తరుణంలో సామాజిక ఉద్యమాలు, సామాజిక సమీకరణలు బలోపేతమై నేటి సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ తొత్తులైన పాలకవర్గాలకు సరైన గుణపాఠం చెప్పడానికి సెమినార్ ఉపయోగపడుతుందని అన్నారు.