తెలంగాణ

చెట్లు లేకుంటే మానవ మనుగడకే చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఆగస్టు23: అంతరించిపోతున్న అటవీ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని, చెట్లు లేకుంటే భావితరాల మనుగడ ప్రశ్నార్థకరంగా మారే ప్రమాదం ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని మావల హరితవనంలో రూ. 3.5 కోట్ల వ్యయంతో నిర్మించిన సాహస క్రీడల పార్కు (అడ్వంచర్ స్పోర్ట్స్)ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగురామన్న, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్.శోభ, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జడ్పీ చెర్మన్ జనార్ధన్, అటవీ అధికారులు, కలెక్టర్ దివ్య తదితరులు ఈ హరితవనంలో జంగిల్ సఫారీ, బోటింగ్ చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఐకెరెడ్డి మాట్లాడుతూ హరితవనంలో భాగంగా ఈ ఏడాది నాటిన మొక్కల్లో 85 శాతం కాపాడకపోతే సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జీవవైవిధ్యం, పర్యావరణం అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల గజ్వేల్‌లో అడవుల పెంపకంపై అందరికీ దిశానిర్దేశం చేశారని, ఆరోగ్యకరమైన సమాజం కోసం సమృద్ధిగా అడవులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అటవీ సంపద ఉంటేనే సకాలంలో వర్షాలు కురుస్తాయని, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని అన్నారు. భూభాగంలో ప్రకృతి వైపరీత్యాలతో జీవకోటికి అనేక అనర్థాలు సంభవిస్తున్నాయని, జనాభా ప్రకారం 33 శాతం అడవులు ఉండాల్సి ఉండగా భూభాగంలో కేవలం 24 శాతం మాత్రమే అడవులు ఉన్నాయని, 230 కోట్ల మొక్కలు నాటేందుకు తెలంగాణలో ప్రణాళిక రూపొందించామని అన్నారు. హరిత తెలంగాణ కలలు గన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. నాటిన ప్రతి మొక్కను ప్రజలు సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. మావల అటవీ ప్రాంతంలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని, సందర్శకులకు బోటింగ్‌తో పాటు పచ్చని చెట్లు, జంతువులను చూసే అదృష్టం కల్గుతుందన్నారు. సాహస క్రీడలు కూడా ప్రతి రోజు నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్ర అటవీ సంరక్షణ చీఫ్ కన్జర్వేటర్ ఆర్.శోభ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 83 అర్బన్ పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లాదంతో పాటు పర్యావరణం పెంపొందించే స్ఫూర్తిని కల్గిస్తుందన్నారు. పార్కులో స్కై సైక్లింగ్, జిప్పింగ్, రోప్ స్పోర్ట్స్‌తో పాటు పర్యావరణ అంశాలకు సంబంధించి పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, ఉమ్మడి జిల్లా అటవీ సంరక్షణ అధికారి వినోద్, జిల్లా అటవీ అభివృద్ధి అధికారి ప్రభాకర్, ఎఫ్‌డివో చంద్రశేఖర్, ఎఫ్ ఆర్‌వో రత్తయ్య తదితరులు పాల్గొన్నారు.