తెలంగాణ

జలాశయంలో మొసళ్ల సంచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేళ్లచెర్వు, ఆగస్టు 23: పులిచింతల ప్రాజెక్టుకు భారీస్థాయిలో వరద నీరు రావడంతో దాదాపు 40 టీఎంసీలకు పైగా నీరును నిల్వఉంచారు. దీంతో ఎగువన ఉన్న ముంపు గ్రామాలతో పాటు దిగువన ఉన్న పంట పొలాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. సందట్లో సడేమియా అన్నట్టుగా ప్రాజెక్టు ఎగువ భాగంలోని బ్యాక్ వాటర్‌లో శుక్రవారం దాదాపు ఆరు మొసళ్లు సంచరించడాన్ని జాలర్లు గుర్తించారు. మొసళ్లు సంచరిస్తున్నాయన్న విషయాన్ని తెలుసుకున్న ముంపు గ్రామాల ప్రజలు, మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు.