తెలంగాణ

కన్నుల పండువగా ప్రొబేషనరీ ఐపీఎస్‌ల పరేడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: సివిల్ సర్వీసెస్‌లో ఇండియన్ పోలీసు సర్వీస్‌కు ఎంపికైన హైదరాబాద్ శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 70వ బ్యాచ్ అధికారుల పాసింగ్ పరేడ్ శనివారం ఉదయం ఘనంగా జరిగింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరై ఐపీఎస్‌ల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ బ్యాచ్ 70వది. ఈ బ్యాచ్‌లో మొత్తం 92 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌లో తెలుగు రాష్ట్రాలకు ముగ్గురు చొప్పున కేటాయించారు. ఐపీఎస్ శిక్షణలో టాపర్‌గా నిలిచిన గౌస్ అలంను తెలంగాణకు కేటాయించారు. కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు. మొదటి సారి అమిత్ షా హోం మంత్రి హోదాలో కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. శిక్షణ పొందిన వారిలో విద్యపరంగా చూస్తే అత్యధికంగా 56 మంది ఇంజనీర్ గ్రాడ్యూయేట్లు 61 శాతం ఉన్నారు. 11 మంది డాక్టర్లు ఐపీఎస్‌లుగా శిక్షణ పొందిన వారిలో ఉన్నారు. వైద్యులుగా సేవలు అందిస్తున్న వారిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్తీకేయన్, మహారాష్టక్రు చెందిన సోనవాన్ కుల్దీప్ సూరేష్, కర్నాటకకు చెందిన పీ సభారీష్, రాజస్థాన్‌కు చెందిన రవీందర్ వర్మ, పంజాబ్‌కు చెందిన మోహతభా సింగ్, తమిళనాడుకు చెందిన ఏ ప్రదీప్, ఢిల్లీకి చెందిన ప్రజ్ఞా జైన్, కర్నాటకకు చెందిన జీ వినీత్ ఉన్నారు. మెడికల్ విభాగానికి చెందిన అభ్యర్థులు 12 శాతంతో ద్వితీయ స్థానంలో నిలువగా తొమ్మిది మంది ఎంబీఏ పూర్తి చేశారు. వారిది తృతీయ స్థానం. ఎన్‌పీఏలో నిర్వహించిన ట్రైనీ ఐపీఎస్‌ల శిక్షణలో 11 మంది విదేశీయులు కూడా ఉన్నారు. వీరిలో నేపాల్‌కు చెందిన వారు ఐదుగురు. రాయల్ భూటాన్ పోలీస్ సర్వీస్‌కు చెందిన ఆరుగురున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీ ఐపీఎస్‌గా శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన పరేడ్‌ను తిలకించేందుకు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో ఎన్‌పీఏ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. యువ ఐపీఎస్‌లతో ఫోటోలు దిగేందుకు పలువురు పోటీపడ్డారు. ఎన్‌పీఏలో పరేడ్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి రెండు గంటల ముందు నుంచే కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చిన వారిని సెక్యురిటీ సిబ్బంది అనుమతించారు. శంషాబాద్ డీసీపీ పర్యవేక్షణలో రాష్ట్ర పోలీసులు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాక సందర్భంగా బందోబస్తును ముమ్మరం చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి శివరాంపల్లి ఎన్‌పీఏ వరకు పోలీసులు తన ఆధీనంలోకి తీసుకుని శాంతి భద్రతలను పర్యవేక్షించారు. రాజేంద్ర నగర్ ఏసీపీ అశోక్ కుమార్ హోం మంత్రి రాక సందర్భంగా బందోబస్తు పర్యవేక్షించారు.
చిత్రం...అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన యువ ఐపీఎస్‌కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రశంసలు