తెలంగాణ

సేఫ్టీబిల్‌పై ప్రతిపాదనలు అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 5: కేంద్రం ప్రతిపాదించిన రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ సేఫ్టీ బిల్-2015పై అభ్యంతరాలను తెలంగాణ ప్రభుత్వం జరిపిన ప్రతిపాదనల అమలుకు చొరవ చూపాలని టిఆర్టీసి స్ట్ఫా అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది. నూతనంగా ప్రతిపాదించిన బిల్లును రవాణా రంగంలో పనిచేస్తున్న అన్ని జాతీయ ఫెడరేషన్లు వ్యతిరేకించాయి. ఈ బిల్లు చట్టం రూపంలోకి వస్తే ప్రజా రవాణా సంస్థలైన ఆర్టీసిలు కనుమరుగవుతాయని, రాజ్యాంగం ప్రకారం రవాణా అనేది రాష్ట్రాల పరిధిలో ఉందని ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బిఎస్ రావు అన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను ఈ మిల్ ఎలా హరించి వేస్తుందో తగిన ఉదాహరణలతో తమిళనాడు ప్రభుత్వం ఒక నోట్‌ను కేంద్రానికి పంపింది. కేరళలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లులోని ప్రమాదకర అంశాలను మార్పు చేయాలని కోరింది.