తెలంగాణ

రైతులను రుణ విముక్తి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 5: రైతులను రుణ విముక్తులుగా చేయండి అని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు రైతులకు వ్యవసాయ రుణాలను లక్ష రూపాయల వరకు బకాయిలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో గుర్తు చేశారు. మొత్తం 37 లక్షల మంది రైతులకు చెందిన 17,028 కోట్ల అప్పులు మాఫీ చేయాల్సి ఉండగా, 4 విడతలుగా మాఫీ చేస్తామని దాట వేశారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం రెండు విడతలుగా 8,898 కోట్ల రుణాలు మాఫీ చేశారని, ఇంకా 8,202 కోట్ల రూపాయలు మాఫీ చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మరో మూడున్నర లక్షల మంది మహిళా రైతులు బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టారని, రైతుల పాసు పుస్తకాలు బ్యాంకుల్లోనే ఉన్నాయని, బ్యాంకులు కొత్తగా ఎవరికీ రుణాలు ఇవ్వడం లేదని ఆయన చెప్పారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందడం లేదని, రుణాలు రావడం లేదని ఆయన తెలిపారు.