తెలంగాణ

అభివృద్ధిలో దూసుకుపోతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావువెల్లడించారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి శాసన మండలిలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రతిపాదనలను సుమారు గంటకుపైగా సుదీర్ఘంగా ఆయన చదివి వినిపించారు. ఏపీ విభజనకు ముందు తెలంగాణకు నిధుల విడుదలలో అన్యాయం జరిగిందన్నారు. గత ఐదు సంవత్సరాలుగా తెలంగాణకు కేటాయించిన నిధులతో శరవేగంగా అభివృద్ధి జరిగిందన్నారు. ప్రతి శాఖకు కేటాయించిన నిధుల గణాంకాలను ఆయన వెల్లడించారు. ప్రభుత్వం తీసుకుంటున్న వినూత్న పథకాలు అమలులో దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆయన సీటు వద్దకు అన్ని పార్టీల ఎమ్మెల్సీలు వచ్చి అభినందనలు తెలిపారు.
చిత్రం... మండలిలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు