తెలంగాణ

అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ప్రజల సంక్షేమం, రైతుల సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. శాసనసభలో సోమవారం వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదిస్తూ, రైతు బంధు పథకం కింద ఎకరాకు ఏటా గత ఏడాది 8000 రూపాయలు ఇవ్వగా, ఈ ఏడు 10,000 రూపాయలు ఇస్తామని తెలిపారు. ఈ పథకం యథాతథంగా కొనసాగుతుందని, ఇందుకోసం బడ్జెట్‌లో 12,000 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. అలాగే రైతుబీమా పథకం కూడా కొనసాగిస్తామని, ఇందుకోసం రైతుల తరఫున ప్రీమి యం చెల్లించేందుకు 1,137 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. అలాగే ఎన్నికల సమయంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పంటరుణాల మాఫీ కోసం బడ్జెట్‌లో 6,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా యధాతథంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని పొలాలకు అందించేందుకు అయ్యే కరెంట్ బిల్లుల భారం రైతులపై వేయబోమని, ప్రభుత్వమే ఈ బిల్లులు చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఈ కారణంగానే విద్యుత్ సబ్సిడీల కోసం చేసే వ్యయం 8,000 కోట్ల రూపాయలకు పెరిగిందని, ఈ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశామన్నారు.
పేదలకు అందించే ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్స్, కల్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, ఆరుకిలోల బియ్యం తదితర పథకాలకు నిధుల కొరత రానివ్వబోమన్నారు. ఆసరాపింఛన్లను పెంచుతున్నామన్నారు. వితంతువులు, వృద్ధులు, బీడీ కార్మికులు, బోదకాలు
బాధితులు, ఒంటరి మహిళలు, నేత-గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పింఛన్‌ను నెలకు 1,000 రూపాయల నుండి 2,016 లకు పెంచామన్నారు. వికలాంగులు, వృద్ధకళాకారుల పింఛన్‌ను 1500 రూపాయల నుండి 3,016 రూపాయలకు పెంచామన్నారు. వృద్ధాప్య పింఛన్ వయోఃపరిమితిని 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు తగ్గించామని, బీడి కార్మికుల పీఎఫ్ కటాఫ్ డేట్‌ను కూడా ప్రభుత్వం తొలగించిందని తెలిపారు. ఆసరా పింఛన్ల కోసం బడ్జెట్‌లో 9,402 కోట్ల రూపాయలు కేటాయించామని కేసీఆర్ వెల్లడించారు.
ఆయుష్మాన్ భారత్ కన్నా తాము కొనసాగిస్తున్న ఆరోగ్యశ్రీ మెరుగైందని, అందుకే ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయడం లేదని కేసీఆర్ తెలిపారు. అరోగ్యశ్రీ పథకానికి 1,336 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు.
*
ఇదీ బడ్జెట్..
(రూ. కోట్లలో)

పూర్తి బడ్జెట్ 1,46,492
రెవెన్యూ ఆదాయం 1,13,099
రెవెన్యూ వ్యయం 1,11,055
మూలధన ఆదాయం 33,444
మూలధన వ్యయం 17,274
రెవెన్యూ మిగులు 2,044
ఆర్థిక లోటు -24,081