తెలంగాణ

అసెంబ్లీ తీర్మానంతో నల్లమలకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 16: గత మూడు నాలుగు నెలల నుండి నల్లమల అటవీ ప్రాంతం ఆందోళనలకు నిలయంగా మారగా అసెంబ్లీ తీర్మానంతో ఆ ఉద్రిక్తతలు సమసిపోనున్నాయ. యురేనియం తవ్వకాలు జరుగుతాయని అధికారులు హడావిడి చేయడంతో ప్రజలు వాటిని అడ్డుకునేందుకు నల్లమల పరిరక్షణ సమితి పేరిట ఆందోళనలకు దిగారు. నల్లమల బంద్‌కు పిలుపునివ్వడం వంటి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే మేధావులు, సినిమా హీరోలు, పర్యావెత్తలు, ప్రజా సంఘాలు, తదితర వర్గాలు నల్లమలను రక్షించుకోవడానికి పోరాటాలకు దిగుతామని వెల్లడించడంతో ఒక్కసారిగా ఈ అంశం జాతీయ స్థాయికి చేరుకుంది.