తెలంగాణ

భిన్న జాతుల మొక్కల సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: ప్రముఖ క్రీడా వైద్య నిపుణుడు ప్రొఫెసర్ మేజర్ డాక్టర్ భక్తియార్ చౌదరి అరుదైన భిన్న జాతులకు చెందిన మొక్కలను సేకరించి ప్రపంచ రికార్డును నమోదు చేశారు. దీనికి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డును అం దుకున్నారు. ఈ ఈఅవార్డును ఇఫ్లూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఇ సురేష్ కుమార్ చేతుల మీదుగా ఇక్కడ జరిగిన కార్యక్రమంలో స్వీకరించారు. గత 40 సంవత్సరాలుగా అరుదైన జాతులకు చెందిన మొక్కలను సేకరించినట్లు భక్తియార్ చౌదరి చెప్పారు. తన ఇంట్లోని 150 చదరపు అడుగుల స్థలంలో 786 విభిన్న జాతులకు చెందిన మొక్కలను పెంచుతున్నారు. తన నివాసంలో ఈ మొక్కల సాంధ్రత వల్ల మెయిన్ రోడ్డు నుంచి వచ్చే శబ్ధకాలుష్యం 10 డెసిబుల్స్ వరకు తగ్గిందని పేర్కొన్నారు. ఇక నీటి కుంటల్లో వేసిన కలువ, లిల్లీపూలు దోమలను నిర్మూలించడంలో సహకరించాయన్నారు. ప్రస్తుతం తాను నదులు, ఆనకట్టల వద్ద ఎదురవుతున్న డీ సిల్టింగ్ సమస్య గురించి పరిశోధన చేస్తున్నానని చెప్పారు.