తెలంగాణ

హంగు, ఆర్భాటాలకే పరిమితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల, సెప్టెంబర్ 20: అట్టహాసానికి, ఆర్భాటానికే రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైందని టీపీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల సందీప్‌రెడ్డి గృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారకులైన విద్యార్థులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత యువత, విద్యార్థుల జీవితాలు దుర్భరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2, 2014 నాడు ప్రభుత్వ లెక్కల ప్రకారం 13 లక్షల మంది నిరుద్యోగులుండగా నేడు అది 24.50 లక్షలకు పెరిగి దాదాపు రెట్టింపయ్యిందన్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించలేదని, స్వయం ఉపాధి అవకాశాలను తగ్గించారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నిరుద్యోగ భృతి సైతం ఇవ్వలేదన్నారు. విద్యార్థులకు సకాలంలో ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేయడంలేదన్నారు. రానున్న హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగ యువత అధికారపార్టీకి సరైన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. సర్పంచ్‌లను బెదిరించి టీఆర్‌ఎస్ పార్టీలోకి చేర్చుకుంటున్నారని ఆరోపించారు. హైద్రాబాద్-సూర్యాపేట- కోదాడ మీదుగా విజయవాడకు నూతన రైల్వే లైన్ నిర్మాణం, మిర్యాలగూడ- జాన్‌పహాడ్-మఠంపల్లి- మేళ్లచెర్వు రైల్వేలైన్‌లో ప్యాసింజర్ రైలు నడపడానికి ఈనెల 26న రైల్వే జనరల్ మేనేజర్‌తో సమావేశమవుతున్నట్టు, ఈ రెండు రైల్వేలైన్లపై ఇప్పటికే లోక్‌సభలో ప్రస్తావించినట్టు తెలిపారు. కార్యక్రమంలో పాలకీడు ఎంపీపీ భూక్యాగోపాల్, బెట్టెతండా సర్పంచ్ మాలోతు మోతీలాల్, బచ్చలకూరి ప్రకాశ్, తాళ్ల రామకృష్ణారెడ్డి, పాండునాయక్, ఉరిమళ్ల రాధాకృష్ణ, బైరెడ్డి జితేందర్‌రెడ్డి, గజ్జల కోటేశ్వర్‌రావు, వై.నర్సిరెడ్డి పాల్గొన్నారు.