తెలంగాణ

కేంద్ర పథకాల అమలు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 20: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను జిల్లాలో వేగవంతంగా, సమర్థవంతంగా అమలు చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కరీంనగర్ స్మార్ట్ సిటీ, అమృత్, యుజిడి, వ్యవసాయం, ఉపాధిహామీ, ప్రధాన మంత్రి కిసాన్ యోజన, ప్రధాన మంత్రి పసల్ బీమా, గృహ నిర్మాణం, ప్రధాన మంత్రి సడక్ యోజన, జాతీయ రహదారుల నిర్మాణం, ముద్ర రుణాలు, స్టాండప్ ఇండియా, స్వచ్ఛ భారత్ తదితర పథకాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటి సారిగా కరీంనగర్‌కు వచ్చానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు జిల్లాలో అమలు తీరుపై అధికారులతో సమీక్షించి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు సమావేశం నిర్వహించామని, ఇక్కడ తీసుకున్న ఫీడ్ బ్యాక్‌తో సంబంధిత పథకాలపై పార్లమెంటులో కేంద్ర మంత్రులతో చర్చించి అధిక నిధుల మంజూరుకు కృషి చేస్తానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తుందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిపి జిల్లాలకు నిధులు మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు. ఇలా ఇచ్చిన నిధులను రాజకీయాలకతీతంగా ప్రజా ప్రతినిధులు అభివృద్ధి పనులను చేపట్టాలని కోరారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం మరికొన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టనుందని, వీటికి నిధులు కూడా కేటాయిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూ.3,50,000 కోట్లతో దేశంలోనే ప్రజలందరికీ తాగునీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించిందని అన్నారు. గతంలో 5 ఎకరాల లోపున్న రైతులకే ఆర్థిక సహాయం అందేదని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అర ఎకరం నుంచి 60 ఎకరాలు ఉన్న రైతులకు కూడా రూ.6 వేల ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. ఈ పథకంలో రైతులను వంద శాతం చేర్పించాలని సూచించారు.
ఎంపీ బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ టీ.జీవన్ రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జేసీ జి.వి.శ్యాం ప్రసాద్ లాల్, జిల్లా రెవెన్యూ అధికారి పి.ప్రావీణ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.