తెలంగాణ

దేశంలో వాతావరణ ఎమర్జెన్సీ ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించడం అందరి బాధ్యతని ఏన్జీటీ మాజీ చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ పిలుపునిచ్చారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ నేతృత్వంలో ‘వాతావరణ అత్యవసర పరిస్థితి’పై ఢిల్లీలో శుక్రవారం జాతీయ సదస్సు నిర్వహించింది.
సదస్సుకు ఏన్జీటీ జస్టిస్ స్వతంత్రకుమార్, పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, ప్రముఖ పాత్రికేయుడు, ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి, సేవ్ రివర్స్ కన్వీనర్ టీ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచానికి పెను సవాల్‌గా మారిన వాతావరణ మార్పు పరిస్థితుల నుంచి భావితరాలనే కాకుండా ప్రస్తుత తరాన్ని రక్షించేందుకు దేశంలో వాతావరణ అత్యవసర పరిస్థితి ప్రకటించాలని సదస్సులో తీర్మానించారు. వాతావరణ మార్పులకు దారి తీస్తున్న గ్లోబల్ వార్మింగ్ వల్ల మానవాళికి ఏర్పడుతున్న ముప్పును గ్రహించి ప్రపంచలోని 18 దేశాలు ఇప్పటికే వాతావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించాయని గుర్తుచేశారు.