తెలంగాణ

పనులు చేయనప్పుడు ప్రతిపాదనలు ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 26: తమ ప్రతిపాదనలను పట్టించుకోనప్పుడు సమావేశాలు, సమీక్షలు ఎందుకని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌పై ఎంపీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో దక్షిణ మధ్య రైల్వే జీఎం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం ప్రారంభానికి ముందే రైల్వే జీఎంతో ఎంపీలు వాగ్వాదానికి దిగారు. సమావేశాలు ఏర్పాటు చేయడంతో అభివృద్ధి పనులు జరిగిపోతాయని ఎలా ఊహించుకుంటారని మూకుమ్మడిగా ఎంపీలు జీఎంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఒకటి రెండు స్టేషన్లలో రైలు ఆపాలని సూచించినా ఫలితం లేదన్నారు. దీని కోసం తాము ఇచ్చే వినితి పత్రాల కోసం రాసే పెన్నుల్లో ఇంకు అయిపోవడం తప్ప జీఎం ఇచ్చే హమీలు నెరవేరడంలేదని ఎద్దేవా చేశారు. తాము సూచించే సూచనలు అమలుకానప్పడు సమావేశాలకు రావడం దండగ అంటూ, అజెండా అంశాల పేపర్ల ఎందుకని
వారు జీఎంను నిలదీశారు. దేశంలో రైల్వేల జోన్లలోదక్షిణ మధ్య రైల్వే ఆదాయం గణనీయంగా ముందుకు పోతోందని జీఎం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలను ఎంపీలు గుర్తు చేశారు. రైల్వే జీఎం అభివృద్ధి పనుల కంటే ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి తమ ప్రతిపాదనలు అమలు జరుగుతాయంటేనే సమావేశాలకు హాజరు అవుతామని ఎంపీలు స్పష్టం చేశారు. రైల్వే పనుల్లో జాప్యం జరుగుతోందని ఎంపీలు వాధించారు. జీఎం గజానన్ మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వేలో వౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. దక్షిణ మధ్య జోన్‌లో అన్ని రైల్వే స్టేషన్లలో మంచినీటి సౌకర్యంను మెరుగుపర్చామన్నారు. ప్లాస్టిక్ వాడకాన్నా అన్ని రైల్వే స్టేషన్లలో పూర్తిగా నిషేధించామన్నారు. ఆధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఏర్పాటుతో ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణం అందుతోందన్నారు. నియోజక వర్గాల్లో ఏళ్ల నుంచి కొత్త రైల్వే మార్గాలు పూర్తి కాకపోవడంతో ఆయా ప్రాంతల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారని వారు జీఎం దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం నడుస్తున్న మార్గల్లో కొత్త రైళ్ల ప్రతిపాదనలు ఏమేరకు అమలు చేస్తారో చెప్పాలని జీఎంను డిమాండ్ చేశారు. రైల్వే మార్గంలో గ్రామాల వద్ద రోడ్డ కమ్ ఫుట్ ఒవర్ బ్రిడ్జిలు పూర్తి చేయడానకి నిధులు ఉన్నాయా లేదా అంటూ వారు ప్రశ్నించారు. కొత్త రైల్వే మార్గాలతో పాటు, కొత్త మార్గాల కోసం సర్వేలు ఏమైనా చేస్తున్నారా అంటూ జీఎంను అడిగారు. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ ఫేస్ -2 పనులు ఎప్పుడు చేపడతారన్నారు. భద్రాచలం-కోవూరు- వికారాబాద్ మార్గాల్లో పనుల పురోగతిపై జీఎంను చెప్పిన సమాధానాలపై ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలో రోజురోజుకు ఎంఎంటీఎస్, డెమో, మెమో రైళ్లకు డిమాండ్ పెరుగుతోందని ఎంపీలు జీఎం తృష్టికి తీసుకువచ్చారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు సూచించిన అన్ని అంశాలను రైల్వే బోర్డ్‌కు పంపిస్తానని జీఎం ఎంపీలకు హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సోయం బాబురావు(ఆదిలాబాద్) డాక్టర్ రంజిత్‌రెడ్డి (చేవెళ్ళ) బండీ సంజయ్‌కుమార్ (కరీంనగర్) నామా నాగేశ్వరరావు (ఖమ్మం) మాలోతు కవిత (మహబూబాబాద్), రేవంత్‌రెడ్డి (మల్కాజిగిరి), పోతుగంటి రాములు (నాగర్‌కర్నూల్) ధర్మపురి అరవింద్ ( నిజామాబాద్) బోర్లకుంట వెంకటేశ్‌నీతూ( పెద్దపల్లి), రాజా అమరేశ్వర్ నాయక్ ( రాయచూర్) భగవంత్ కుభూ (బీదర్) ఉమేష్‌జాదవ్ (గుల్బర్గా) కేశవరావు ( రాజ్యసభ), బండా ప్రకాశ్ (రాజ్యసభ)తో పాటు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు హాజరు అయ్యారు.
*చిత్రం... సికింద్రాబాద్ రైల్ నిలయంలో గురువారం లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో మాట్లాడుతున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం