తెలంగాణ

సర్వం సిద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె ప్రభావం వివిధ ప్రాంతాలకు వెళ్లి, తిరిగి తమతమ స్వస్థలాలకు చేరుకునే ప్రయాణికులపై పడకుండా సర్కారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకు అవసరమైన పటిష్టమైన వ్యూహరచనను ఖరారు చేసింది. అందులో భాగంగానే డిపోల వద్ద ఆందోళనలకు అవకాశం లేకుండా అన్ని డిపోల వద్ద డిఎస్పీ స్థాయి పోలీసు అధికారి ఇంచార్జీగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమ్మెకు ముందు బస్సుల టూర్ షెడ్యూల్ ఎలా ఉండేదో అదేమాదిరిగా శుక్రవారం నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దసరాకు వెళ్లి ప్రయాణికుల తిరుగు ప్రయాణం, అలాగే పండుగ సెలవుల తర్వాత ఈ నెల 14 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానుండటం పూర్తిస్థాయిలో బస్సులను నడిపించాలని అధికారులను ఆదేశించింది. సమ్మె నేపథ్యంలో బుధవారం అన్ని జిల్లాల ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లు, రీజినల్, డివిజినల్ మేనేజర్లు, జిల్లా రవాణా అధికారులతో బుధవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్‌లో గురువారం కలక్టర్లతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమావేశం కానున్నారు. గ్రామాలలో అమలు చేస్తున్న 30 రోజుల కార్యాచరణను సమీక్షించడానికి కలెక్టర్ల సమావేళం ఏర్పాటు చేసినప్పటికీ, ప్రధానంగా ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పట్లపైనే ప్రధానంగా సీఎం చర్చించనున్నట్టు సమాచారం. ఇలా ఉండగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రైవేట్ బస్సులకు అనుమతించడంతో టికెట్ ధర కంటే అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ అంశాన్ని
ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. టికెట్ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రవాణా వ్యవస్థకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. ప్రయాణికులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలు నడుపుతున్నామన్నారు. ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో చార్జీలపై దృష్టి పెడుతున్నామని, టికెట్ కంటే ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఇక నుంచి ప్రతి బస్సులో టికెట్ చార్జీల పట్టిక బోర్డులను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెకు ముందు ఎలాంటి టూర్ షెడ్యూల్ ఉండేదో అదే షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నుంచి అమలు చేస్తామని మంత్రి పువ్వాడ చెప్పారు. ఆర్టీసీ రాయితీ పాస్‌లను తప్పనిసరిగా అనుమతించాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి చెప్పారు. ఆర్టీసీ సమ్మె వల్ల ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రైవేట్ వాహనాల సేవలను వినియోగించుకుంటున్నామని తెలిపారు. బుధవారం 3,116 ఆర్టీసీ బస్సులతో పాటు 1,933 అద్దె బస్సులు, ప్రైవేట్ వాహనాలను నడిపించినట్టు మంత్రి వివరించారు. సమ్మె వల్ల ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా ఎంఎంటీఎస్, మెట్రోరైళ్ల రాకపోకలను పెంచామన్నారు. ఇలా ఉండగా ఆర్టీసీలో కొత్తగా కండక్టర్లు, డ్రైవర్ల నియామకానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. విధి విధానాలు ఖరారు చేసి ముఖ్యమంత్రి ఆమోదానికి ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. ఈ అంశంపై గురువారం జరిగే కలక్టర్ల సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.