తెలంగాణ

అలయ్ బలయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: తెలంగాణ సంస్కృతికి అలయ్ బలయ్ వేడుకలు ప్రతీకని, అన్ని వర్గాలు సామరస్యంగా జీవించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తల్లులు తమ పిల్లలకు బలవర్థకమైన ఆహారాన్ని ఇవ్వాలని, జంక్ ఫుడ్‌లు ఇవ్వవద్దని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పిల్లల్లో 25 శాతం ఊబకాయం, 33 శాతం పౌష్టికాహార లోపం ఉందని ఆమె అన్నారు. గురువారం ఇక్కడ జలవిహార్‌లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ వేడుకలు ఘనంగా జరిగాయి. గత 15 సంవత్సరాలుగా దత్తాత్రేయ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకుచెందిన నేతలు హాజరై ఆత్మీయత ఉట్టిపడే విధంగా ఆలింగనం చేసుకుని దసరా శుభాకాంక్షలు తెలిపారు. నోరూరించే తెలంగాణ వంటకాలతో కూడిన విందు భోజనం వడ్డించారు. రాష్ట్ర సంస్కృతికి ప్రతీకగా నిలిచే జానపద, గ్రామీణ ప్రదర్శనలు అలరించాయి. కేంద్రహోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ సీ హెచ్ విద్యాసాగర్ రావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎంపీలు కె కేశవరావు, రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ విశే్వశ్వరరెడ్డి, జితేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు ఇంకా ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ బతుకమ్మ, దసరా, అలయ్ బలయ్ కార్యక్రమాలు సాంస్కృతిక అనుబంధాన్ని పెంచుతాయన్నారు. అందరికీ నమస్కారం అని ఆమె తెలుగులో ప్రజలను సంబోధించారు. తాను తెలంగాణ గవర్నర్‌గా నియమించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల మధ్య సంస్కృతిలో పెద్దగా తేడాలు లేవని, మనమంతా ఒకటి అని ఆమె అన్నారు. రాజ్‌భవన్‌లో కూడా బతుకమ్మ వేడుకలను ఐదు రోజులు నిర్వహించామన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సామరస్యంగా జీవించేందుకు అలయ్ బలయ్ వేడుకలు సహకరిస్తాయన్నారు.
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా అలయ్ బలయ్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్భ్రావృద్ధికి ఏకాభిప్రాయంతో పనిచేయాలన్నారు. భావితరాలకు మంచి సందేశం ఇచ్చేందుకు ఈ వేడుకలను ఉపయోగించుకోవాలన్నారు. సిద్ధాంతాలు, రాద్ధాంతాలతో పనిలేదని, రాజకీయాలను పక్కనపెట్టి అందరు ప్రజల కోసం ఏకతాటిపైకి రావాలన్నారు. తాను తెలంగాణ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణలో అలయ్, బలయ్ నిర్వహించిన పాత్రను ప్రశంసించారు. తెలంగాణ సాంస్కృతిక విప్లవం, ఇక్కడ ప్రజా సంస్కృతి ప్రపంచ దృష్టిని ఆకర్షించిందన్నారు. మన భాషను సుసంపన్నం చేసుకునేందుకు అందరూ ప్రతినబూనాలన్నారు. కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది దసరా అనేక సంతోషకరమైన సందేశాలను తెచ్చిందన్నారు. 370వ అధికరణ రద్దు ద్వారా దేశ ఐక్యతను చాటామన్నారు. పార్టీలకు అతీతంగా మనమంతా ఇక్కడ చేరి రాష్ట్భ్రావృద్ధికి అవిశ్రాంతంగా పనిచేయాలన్నారు. అలయ్ బలయ్ వేడుకలు తెలంగాణ సంస్కృతికి చిహ్నమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
పీసీసీ మాజీ నేత వీ హనుమంతరావు మాట్లాడుతూ కొత్త గవర్నర్ తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని, ప్రజా సమస్యలు నివేదిస్తామని కోరారు. గత గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇచ్చేవారు కారన్నారు. అలాగా అలయ్‌బలయ్ వేదిక వెలుపల అన్ని పార్టీల నేతల బొమ్మలను పెట్టి ఉండే బాగుండేదని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. తొలుత బండారు దత్తాత్రేయ కుటుంబ సభ్యులు వినాయకుడికి పూజ చేసి అలయ్ బలయ్ వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ చింతకింది మల్లేశం, బోడేసాయి దీపక్, కోండల్ రావు వెల్చాల, పనె్నండుమెట్ల కినె్నర మొగిలయ్య, ఏకలవ్య ఫౌండేషన్‌కు చెందిన పీ వేణుగోపాల్ రెడ్డి, సిరివెనె్నల సీతారామ శాస్ర్తీ, బాక్సింగ్ కోచ్ బలరాం యాదవ్‌ను బండారు దత్తాత్రేయ సత్కరించారు.
*చిత్రం...అలయ్ బలయ్ వేడుకల్లో పాల్గొన్న నాయకులు