తెలంగాణ

ఇక ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో స్థానికులకే ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, అక్టోబర్ 14: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు యాజమాన్యం అంగీకరించింది. స్థానికులే ఉద్యోగాలివ్వాలన్న ప్రధాన డిమాండ్‌తో కొంతకాలంగా రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. స్థానికంగా ఉన్న ఎరువుల కర్మాగారం పరిశ్రమలో స్థానికేతరులకు అవకాశం ఇచ్చి స్థానికులకు మొండి చెయ్యి చూపడాన్ని ఎమ్మెల్యే చందర్ వ్యతిరేకిస్తూ ఆందోళనలు, నిరసనలు చేపట్టిన నేపథ్యంలో కదలిక వచ్చింది. సోమవారం ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్రధాన గేట్ ముందు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీఆర్ ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.
నియోజక వర్గంలోని వందలాది మంది శ్రేణులు ఆర్ ఎఫ్‌సీ ఎల్ గేట్ ముందు బైఠాయించి నిరసనకు దిగారు. ఆర్‌ఎఫ్‌సిఎల్ యాజమాన్యం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఇక్కడ గంటల పాటు నిరసన చేస్తూ వంటా-వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ఆర్ ఎఫ్‌సీఎల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వ్యతిరేకంగా ఉండటాన్ని ఎండగట్టారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించే వరకు తాము పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని, ఎంతటి ఉద్యమం చేయడానికైనా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని రామగుండం ఎమ్మెల్యే చందర్ హెచ్చరిస్తూ ఇక్కడే మకాం వేశారు. దీంతో ఆర్‌ఎఫ్‌సిఎల్ యాజమాన్యం దిగి వచ్చింది. ధర్నా సమయంలోనే ఎమ్మెల్యేతో పాటు పార్టీ ప్రతినిధులతో ఆర్‌ఎఫ్‌సి ఎల్ అధికారులు చర్చలు జరిపారు.
కాంట్రాక్టు ఉద్యోగాల్లో స్థానికులకు 90 శాతం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో స్థానికులకు వంద శాతం ఉద్యోగాలు కల్పించే విషయమై ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యం ఈ సందర్భంగా అంగీకరిస్తూ ఒప్పందం చేసుకుందని తెలిపారు. నాయకులు పెంట రాజేష్, గోపగోని మోహన్ గౌడ్, పాతపెల్లి ఎల్లయ్య, మారుతి, సాగంటి శంకర్, దుర్గం రాజేశం, చుక్కల శ్రీనివాస్, దీటి బాలరాజ్, అభిషేక్ రావు, అడ్డాల రామస్వామి, అచ్చ వేణు, నూతి తిరుపతి, అడప శ్రీనివాస్, సిహెచ్.మొగిలి తదితరులున్నారు.
*చిత్రాలు.. ప్రధాన గేట్ ముందు ధర్నా చేస్తున్న స్థానికులు
* ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారులతో చర్చిస్తున్న ఎమ్మెల్యే