తెలంగాణ

నిలోఫర్ ఆసుపత్రి నుంచి వీణావాణీల తరలింపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: తలలు అంటుకుని జన్మించిన అవిభక్త కవలలను నిలోఫర్ ఆసుపత్రి నుంచి యూసుఫ్‌గూడ ఎల్లారెడ్డిగూడలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తోన్న స్టేట్‌హోంకు తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వీరి తరలించే ప్రక్రియ మొదలుకుని స్టేట్‌హోంలో వైద్య పరంగా వారికి కావల్సిన సహాయాన్ని అందించేందుకు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ముందుకు రావటంతో నిలోఫర్ ఆసుపత్రి నుంచి వీణావాణీలను త్వరలించే అవకాశాలున్నాయి. కానీ ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ సురేశ్‌కుమార్ మాత్రం ఈ అవిభక్త కవలలను తరలించాలని ప్రభుత్వం నుంచి తమకేమీ ఆదేశాలు రాలేదని వెల్లడించారు.
అంతేగాక, 12 ఏళ్లకు పై బడిన వారికి నిలోఫర్ ఆసుపత్రిలో ఎలాంటి వైద్యం చేయరాదన్న నిబంధన ఉండటంతో వీరిని స్టేట్‌హోంకు తరలించాలని వైద్యులు నిర్ణయం తీసుకున్నా, పదమూడేళ్ల పాటు అమ్మప్రేమ పంచిన నిలోఫర్ ఆసుపత్రిని విడిచి వెళ్లేందుకు వీణావాణీలు ఇష్టడటం లేదని తెలిసింది. 2003 అక్టోబర్ 15న నాగమణి, మురళీ దంపతులకు జన్మించిన ఈ అవిభక్త కవలలకు ప్రపంచలోనే అరుదైన ఆపరేషన్ చేసి, విడదీసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన ఎంతో మంది వైద్యులు తొలుత ముందుకొచ్చినా, ఆ తర్వాత ఆపరేషన్ సక్సెస్ రేటు తక్కువగా ఉండటంతో ఆ తర్వాత వెనకంజ వేయటం వంటివి జరిగాయి. యూసుఫ్‌గూడలోని స్టేట్‌హోంకు తరలించనున్న వీణావాణీల తల్లిదండ్రులకు వారి నిర్వాహణ వ్యయాన్ని భరించే ఆర్థిక స్తోమత లేకపోవటంతో వారికెలాంటి ఇన్ఫాక్షన్ రాకుండా పలు జాగ్రత్తలతో పాటు వారికి అవసరమైన మందులను అందించేందుకు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్(హెచ్‌హెచ్‌ఎఫ్) ముందుకొచ్చినట్లు తెలిసింది.