తెలంగాణ

టీఆర్‌ఎస్‌కు మద్దతు ఉపసంహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని తొలుత భావించామని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు తమ హక్కులు, డిమాండ్లపై గత పది రోజులుగా సమ్మె చేస్తున్నా సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా, అన్యాయంగా ఉందని, సమ్మె కార్మికుల చట్టబద్ధమైన హక్కు అని అన్నారు. అలాంటి హక్కును ప్రభుత్వం నిరాకరించడం కార్మిక వ్యతిరేక వైఖరేనని, పైగా వారితో చర్చలకు నిరాకరిస్తూ దాదాపు 48 వేల మంది కార్మికులను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తామని ప్రకటించడం ద్వారా ప్రభుత్వమే కార్మికులను రెచ్చగొట్టిందని అన్నారు. సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైందని, ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంటోందని వెంకటరెడ్డి విమర్శించారు. కొత్త రిక్రూట్‌మెంట్ ప్రకటించి నిరుద్యోగ యువకులను ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చి ఘర్షణ పూరిత వాతావరణాన్ని కలిగించిందని,
ఈ వైఖరి మార్చుకోమని సీపీఐ ఎంతగా చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, మానసిక వ్యధతో మరికొంతమంది గుండెపోటుతో, ఇంకొంతమంది మరణిస్తున్నారని పరిష్కారానికి బదులు ప్రభుత్వం మరింత విద్వేషపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఈ పరిస్థితుల్లో సీపీఐ కార్మికవర్గ పార్టీగా, శ్రామికవర్గ పార్టీగా స్పందించిందని, హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఉపసంహరించాలని తమ పార్టీ నిర్ణయించిందని ఆయన స్పష్టం చేశారు.

*చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి