తెలంగాణ

కమలనాథన్ కమిటీ భేటీ అర్ధాంతరంగా వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: సచివాలయంలో బుధవారం సమావేశమైన కమలనాథన్ కమిటీ సమావేశం తెలంగాణ ఉద్యోగుల ఆందోళనతో అర్ధాంతరంగా వాయిదా పడింది. వైద్య ఆరోగ్యశాఖ, పశుసంవర్ధకశాఖ, ప్రజారోగ్యశాఖలకు చెందిన సెక్షన్ ఆఫీసర్స్ (ఎస్‌ఓ), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ (ఎఎస్‌ఓ) ఉద్యోగుల విభజనపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో కమలనాథన్ కమిటీ సమావేశం అయింది.
అయితే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 84 మంది సెక్షన్ ఆఫీసర్స్‌ను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడం పట్ల సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులను అదే రాష్ట్రానికి కేటాయించాలని కమలనాథన్ కమిటీని డిమాండ్ చేసింది. ఉద్యోగుల కేటాయింపులో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగేలా కమలనాథన్ కమిటీ వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ కమిటీ సమావేశం జరుగుతున్న హాలు ఎదుట తెలంగాణ ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులకు కల్పించిన ఆప్షన్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఆప్షన్ల ప్రకారం ఏ రాష్ట్రంలో పని చేయడానికి సంసిద్ధంగా ఉంటే వారికి అదే రాష్ట్రాన్ని కేటాయించాలని నిబంధనలు ఉన్నాయని కమలనాథన్ కమిటీ వాదించింది. కాగా స్థానికత అంశంలో రాష్టప్రతి ఉత్తర్వులనే రద్దు చేయగా లేనిది ఉద్యోగుల ఆప్షన్లను రద్దు చేయలేరా అని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తమపై ఆంధ్ర అధికారుల పెత్తనమే కొనసాగుతుందా? అని పద్మాచారి ప్రశ్నించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులకు కల్పించిన ఆప్షన్లను రద్దు చేయాలని, ఏ రాష్ట్రానికి చెందిన వారిని అదే రాష్ట్రానికి కేటాయించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని పద్మాచారి హెచ్చరించారు. తెలంగాణ ఉద్యోగుల ఆందోళనతో కమలనాథన్ కమిటీ సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది.