తెలంగాణ

అన్ని దేవాలయాల్లో విజయా నెయ్యి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ప్రభుత్వ సంస్థల్లో విజయా నెయ్యి వంటి ఉత్పత్తులను వినియోగించేలా చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. ఈ విషయంలో త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం బేగంపేటలోని హరితప్లాజాలో జరిగిన విజయా డెయిరీ బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ మాట్లాడుతూ జాతీయ రహదారుల వెంట విజయా ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రైవేటు డెయిరీల ఉత్పత్తుల ధరలకు అనుగుణంగా విజయ డెయిరీ ఉత్పత్తుల ధరలపై నిర్ణయం తీసుకునే విషయాన్ని పరిశీలించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అన్ని దేవాలయాల్లో విజయా నెయ్యి మాత్రమే వినియోగించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించగా, ఇందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని సమావేశానికి హాజరైన దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. రానున్న సమ్మక్క సారక్క జాతరలో సుమారు 150 మొబైల్ ఔట్‌లెట్‌ల ద్వారా విజయా ఉత్పత్తులను విక్రయించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. విజయా ఉత్పత్తుల విక్రయాలను మరింత పెంచేందుకు విస్తృత ప్రచారం కల్పించేందుకు కూడా చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. అదేవిధంగా విజయా ఉత్పత్తులపై సినిమా ధియేటర్లు, సోషల్ మీడియాలో ప్రచారం కల్పించాలని ఆదేశించారు. వాల్ పెయింటింగ్, పర్యాటక ప్రాంతాలు, జాతీయ రహదారులు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాల్లో ప్రచారం కల్పించేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్, హెచ్‌ఎండీఏ పరిధిలో విజయా పాల విక్రయాలను పెంచుకునేందుకుగాను నూతనంగా 500 పాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో విజయా డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, ఎండీ శ్రీనివాసరావు, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.