తెలంగాణ

కదం తొక్కిన ‘మల్లన్న’ బాధితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూలై 13: మెదక్ జిల్లా తొగుట, కొండపాక మండలాల పరిధిలో నిర్మించ తలపెట్టిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ వివాదం మరింత రాజుకుంది. మంగళవారం భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఏటిగడ్డ కిష్టాపూర్‌కు చెందిన కొంతమంది గ్రామస్తులతో చర్చలు జరిపి 6 లక్షలకు ఎకరం చొప్పున భూములు ఇస్తామంటూ అంగీకరించడంతో గ్రామంలో మరోమారు ఉద్రిక్తత చోటుచేసుకుంది. అదే రోజు రాత్రి మహిళలంతా తిరుగుబాటు చేసి చర్చలకు వెళ్లిన వారిని నిలదీసిన విషయం తెలిసిందే. కాగా బుధవారం నాడు లక్ష్మాపూర్, ఏటిగడ్డ కిష్టాపూర్, వేములగట్, ఎర్రవల్లి, పల్లెపహాడ్, శింగారం తదితర గ్రామాలకు చెందిన వందలాది మంది మహిళలు, పురుషులు, యువకులు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గజ్వేల్ ప్రాంతానికి చెందిన పోలీసులు బాధితులను అడ్డుకున్నారు. పోలీసులను తప్పించుకుని సుమారు పది కిలోమీటర్ల దూరం గజ్వేల్ వరకు పాదయాత్ర నిర్వహించుకుంటూ తరలివచ్చారు. అక్కడి నుంచి డిసిఎం వాహనాల్లో జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని సమీకృత కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న విషయం తెలుసుకున్న సంగారెడ్డి పోలీసులు కలెక్టరేట్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసారు. భూముల ముంపు బాధితులను కలెక్టరేట్‌కు తరలించడంలో కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, సిపిఎం వామపక్షాలు చురుకుగా వ్యవహరించి లక్ష్యాన్ని సాధించుకున్నాయి. కలెక్టరేట్ ప్రధాన ద్వారం ముందు బాధితులు బైఠాయించి మల్లన్న సాగర్ వద్దు.. గ్రామాలే ముద్దు అంటూ ముక్తకంఠంతో గళమెత్తి నినదించారు.
కలెక్టరేట్‌లోకి వెళ్లి కలెక్టర్‌కు వినతి పత్రాలు సమర్పిస్తామంటే డిఎస్పీ తిరుపతన్న అభ్యంతరం వ్యక్తం చేస్తూ కలెక్టర్ అనుమతి తీసుకున్న అనంతరం అనుమతిస్తామంటూ ఫోన్‌లో కలెక్టర్‌ను సంప్రదించారు. కలెక్టర్ రొనాల్డ్ రోస్ సూచనల మేరకు ఆయా పార్టీలకు చెందిన నాయకులతో పాటు కొంత మంది బాధితులను కలెక్టరేట్‌లోకి అనుమతించారు. ఆయా గ్రామాల రైతుల వినతి పత్రాలతో పాటు బుధవారం ఎర్రవల్లి గ్రామ పంచాయతీలో భూములు ఇవ్వమంటూ ఏకగ్రీవంగా చేసిన తీర్మానం ప్రతిని కలెక్టర్‌కు అందించారు. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ కలెక్టర్‌తో మాట్లాడుతూ తాము ప్రాజెక్టులు కట్టేందుకు అడ్డుతగలడం లేదని, బాధితుల కోసం యుపిఎ ప్రభుత్వం 2013 సెప్టెంబర్‌లో తీసుకువచ్చిన చట్టం ప్రకారం న్యాయం చేయాలని కోరుతున్నామని వివరించారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ రొనాల్డ్ రోస్ మాట్లాడుతూ గతంలోనే తాను బాధితులతో చర్చించానని, వారి అభీష్టం మేరకు 2013 చట్టమా? 123 జీవోనా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని అన్నట్లు సమాధానం ఇచ్చారు. 2013 చట్టం ప్రకారం త్వరలోనే నోటిఫికేషన్ వెల్లడిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు సంతృప్తితో వెళ్లిపోయారు.