తెలంగాణ

ఆర్టీసీ సమ్మెకు 30మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రుల మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 17: ‘సకల జనుల సమ్మెతో సీఎం సీటెక్కినవ్ అధికారం లోకి వస్తే ఆర్టీసీని సర్కార్‌లో విలీనం చేస్తామన్న మాటే‘మాయే’ సమ్మెకు 30 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రుల మద్దతుంది, ఇచ్చిన మాట నిలుపుకో.. కేసీఆర్ సర్‌‘కారు’ కూలకుండా చూసుకో..’ అని టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం హెచ్చరించారు. గురువారం కరీంనగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆరంభం నుండి అండగా నిలిచి అధికారంలోకి తీసుకురావడానికి సమ్మెకు దిగిన సకల జనులను కేసీఆర్ మరిచారని, స్వరాష్ట్రం వస్తే ఆర్టీసీనీ సర్కార్‌లో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి జీతాలు ఇస్తామని చెప్పిన మాటేమైందనిప్రశ్నించారు. ఎక్కిన కొమ్మ నరుక్కో‘వద్దు’.. కార్మికుల సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపజేసి ప్రయాణికుల రాకపోకల ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. సకలజనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు అలుపెరుగని పోరు సల్పారని కేసీఆర్ కీర్తించారని, తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకితభావంతో కృషి చేశారని పొగిడారని గుర్తు చేశారు. ఆది నుంచి ఉద్యమానికి అండగా నిలిచిన వారిని మరిచి, ఇప్పుడు పార్టీలు మారినవారిని అందలమెక్కించావని, వారు మంత్రులయ్యాక ఆర్టీసీ సమ్మెపై అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులపై ఒంటికాలితో లేస్తూ కారాలు, మిరియాలు నూరుతున్న మంత్రులు ఉద్యమం సమయంలో ఎక్కడున్నారని? కాంతం ప్రశ్నించారు. నాడు ఉద్యోగాలు తొలగిస్తామన్నా తెలంగాణ కోసం ఉద్యమించిన ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారంలో సీఎం కేసీఆర్ మీనమేషాలు లెక్కించడం బాధాకరమన్నారు. నెల రోజులు ముందే నోటీసు ఇచ్చి సమ్మెకు దిగితే ఉద్యోగాలు తొలగిస్తావా? ఆర్టీసీ ఆస్తుల అన్యాక్రాంతం చేస్తూ ప్రైవేటీకరణకు కుట్రకు తెరతీస్తున్నారన్నారు. రోజుకో కార్మికుడు రిటైర్ అవుతున్నా నియామకాలు చేపట్టక నిరుద్యోగం పెరుగుతోందని, ఇద్దరు వ్యక్తుల కోసం 50 వేల ఆర్టీసీ కార్మికుల జీవితాలను ఫణంగా పెట్టేందుకు సీఎం కేసీఆర్ కుట్రకు తెరతీస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైందని నమ్మి 30మంది అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులు పరోక్షంగా మద్దతిస్తున్నారని,అన్ని పక్షాలు, ఉద్యోగ సంఘాలు కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతునిస్తున్నాయన్నారు. పక్కరాష్ట్రం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కేసీఆర్ అదే తరహాలోనైనా ఇప్పటికైనా ప్రభుత్వంలో విలీనం చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం హితవు పలికారు. ఈ సమావేశంలో సముద్రాల అజయ్, ఎర్ర శ్రీనివాస్, సుంకరి గణపతి తదితరులు ఉన్నారు.
*చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న గజ్జెల కాంతం