తెలంగాణ

రాహుల్‌ను రప్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూలై 13: నమ్మి పట్టం కట్టిన ప్రజలను మల్లన్న సాగర్ ప్రాజెక్టు పేరుతో నిట్ట నిలువునా ముంచేందుకు తెలంగాణ ప్రభుత్వం చూస్తుందని, అలాంటి ఆటలకు మన తెలంగాణలో కొనసాగవని, మల్లన్న సాగర్ ముంపు బాధితులకు న్యాయం చేకూర్చడానికి అవసరమైతే ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని రప్పించడానికి కూడా సిద్దంగా ఉన్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ ధైర్యం కల్పించారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని సమీకృత కలెక్టరేట్ ముందు బైఠాయించిన మల్లన్న సాగర్ ముంపు బాధితులను ఉద్దేశించి మాట్లాడారు. మాయమాటలతో మభ్యపెట్టే దొరలను తరిమి కొట్టిన తెలంగాణ మనదని, ఎవరు కూడా అధైర్యానికి గురికాకూడదన్నారు. నిజమైన తెలంగాణ బిడ్డలం మనమని, సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావులకు దమ్ము, ధైర్యం ఉంటే గ్రామాలకు వచ్చి గ్రామ సభలు నిర్వహించి ప్రజల ఆమోదం మేరకు ప్రాజెక్టును కట్టాలని సవాల్ చేసారు. 2013 చట్టం ప్రకారం గ్రామానికి చెందిన 80 శాతం మంద్రి ప్రజలు ఆమోదం తెలిపితేనే భూములు సేకరించాలన్న నిబంధనలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందన్నారు. మంత్రి హరీశ్‌రావు దొంగచాటుగా చర్చలు జరిపి గ్రామస్తుల మధ్య చిచ్చు రగుల్చుతున్నాడని, అలాంటి మాటలను నమ్మి మోసపోకూడదన్నారు. అన్నింటికి కలెక్టరే సుప్రీం అని ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో త్వరలోనే తేలుతుందని, అప్పటి వరకు వేచి ఉండాలని, తదుపరి కార్యాచరణను రచించుకుని ఉద్యమిద్దామంటూ సూచించారు.
మల్లన్న సాగర్ ముంపు బాధితులకు పూర్తి న్యాయం చేసే వరకు ఎన్ని ఖర్చులకైనా, ఎంతటి శ్రమకైనా ఓర్చుకుని మీ వెంటే ఉంటామన్నారు. హైకోర్టు ప్రశ్నలకు సైతం ఈ ప్రభుత్వం తప్పుడు సమాధానాలు ఇచ్చిందని, బలవంతంగా ఎవరి నుంచి భూ సేకరణ చేయడం లేదంటూనే భయబ్రాంతులు, ప్రలోభాలకు గురి చేసి తన కార్యం పూర్తి చేయాలని చూస్తుందని ధ్వజమెత్తారు. ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వమన్నారు.